#విశాఖ భక్తి సమాచారం 🙏🕉️🙏 ఆధ్యాత్మిక నగరం భక్తి విశేషాలు #విశాఖపట్నం సమాచారం 📷స్థానిక వార్తలు 📺 లోకల్ న్యూస్ ✍️
( Visakhapatnam Local News ) #ధనుర్మాసం ప్రారంభం *పవిత్ర ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం*ధనుర్మాస వైశిష్ట్యం/ధనుర్మాసం వ్రత విధానం #ధనుర్మాసం నెలగంట సింహాచలం శ్రీ సింహాద్రి అప్పన్న సన్నిధిలో ధనుర్మాసం పూజలు #ధనుర్మాసం
కార్యనిర్వహణాధికారి కార్యాలయం
శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం, విశాఖపట్నం జిల్లా
సింహాద్రి అప్పన్న సన్నిధిలో ధనుర్మాసం మహోత్సవాలు
తేదీ 10,డిసెంబర్ 2025, బుధవారం.
డిసెంబర్ 16 నుండి జనవరి 19 వరకు ప్రత్యేక ఉత్సవాలు, దర్శన వేళల్లో మార్పులు
ఉత్తరాంధ్ర పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి దేవస్థానంలో రాబోయే ధనుర్మాసం సందర్భంగా పలు ప్రత్యేక ఉత్సవాలు, కైంకర్యాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ప్రకటించింది. ఈ కారణంగా భక్తుల దర్శన వేళల్లో మరియు ఆర్జిత సేవల్లో తాత్కాలిక మార్పులు చోటుచేసుకుంటాయి.
ధనుర్మాసం ప్రారంభం 16.12.2025 మధ్యాహ్నం గం. 01:01 నిమిషాలకు శ్రీ స్వామివారి సన్నిధిలో "నెలగంట పెట్టుట" (ధనుర్మాసం ప్రారంభం) జరుగును.
(16.12.2025): ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా ఆ రోజు ఉదయం సుమారు గం. 11:30 నిమిషాల నుండి మధ్యాహ్నం గం. 02:30 నిమిషాల వరకు స్వామివారి దర్శన నిలుపుదల చేయబడును.
తేది. 20.12.2025 నుండి తేది. 29.12.2025 వరకు.
ఈ పది రోజుల పాటు దేవాలయంలో శ్రీ స్వామివారి పగల్ పత్తు ఉత్సవములు, ముక్కోటి ఏకాదశి, ధారోత్సవములు మరియు కనుమ పండుగ సందర్భంగా ప్రతి రోజు ఉదయం శ్రీ స్వామి వారి తిరువీధి ఉత్సవములు, విశేష సేవలు జరుగును.
ఈ ప్రత్యేక ఉత్సవాల కారణంగా, పైన పేర్కొన్న తేదీలలో (20.12.2025 నుండి 29.12.2025 వరకు) నిత్యము జరుగు శ్రీ స్వామివారి ఆర్జిత సేవలు అన్నియు రద్దు చేయబడును.
తేది. 30.12.2025 నుండి తేది. 09.01.2026 వరకు రాపత్తు ఉత్సవములు జరుగును.
ఈ సందర్భంలో ప్రతి రోజు సాయంత్రం గం. 05:00 లకు శ్రీ స్వామివారి తిరువీధి ఉత్సవములు వైభవంగా జరుగును.
రాపత్తు ఉత్సవాల కారణంగా, ఈ తేదీలలో (30.12.2025 నుండి 09.01.2026 వరకు) రాత్రి గం. 07:00 గంటల వరకు మాత్రమే భక్తులకు శ్రీ స్వామివారి దర్శనములు లభించును.రాత్రి దర్శన వేళల్లో మార్పులు గమనించ గలరు.
కుడారై ఉత్సవం
తేది: 11.01.2026 ఆ రోజు గం. 09:00 నుండి గం. 10:30 వరకు శ్రీ స్వామి వారి దర్శనాలు నిలిపివేయబడును.
సుప్రభాతం & ఉదయం ఆరాధన టిక్కెట్ల రద్దు
తేదీలు: 16.12.2025 నుండి 19.01.2026 వరకు ధనుర్మాసం దృష్ట్యా ఈ కాలంలో:
సుప్రభాతం సేవ
ఉదయం ఆరాధన టిక్కెట్లు రద్దు చేయబడుచున్నవి.
గోదా కళ్యాణం — భోగి పండుగ
తేది: 14.01.2026 గోదా కళ్యాణం — భోగి పండుగఈ రోజు ప్రత్యేకంగా "గోదా కళ్యాణం" సాయంత్రం 05:00 నుండి 06:30 వరకు వైభవంగా జరగును. సాధారణంగా ఉదయం జరుగు నిత్యకళ్యాణం ఈ రోజు గోదా కళ్యాణంతో కలిపి సాయంత్రం జరుగును. భక్తులు విరివిగా పాల్గొనవలసిందిగా దేవస్థానం కోరుచున్నది.
సహస్రనామార్చన టిక్కెట్ల రద్దు
తేదీలు: 30.12.2025 నుండి 19.01.2026 వరకు ఈ తేది లలో సహస్రనామార్చన సేవ టిక్కెట్లు రద్దు చేయబడును.
భక్తులకు వినతి
పైన తెలిపిన తేదీలు, సమయాలు, దర్శన మార్పులు, రద్దు చేయబడిన ఆర్జిత సేవలను దృష్టిలో ఉంచుకొని భక్తులు తమ దర్శన, సేవ కార్యక్రమాలను ముందస్తుగా ప్లాన్ చేసుకోవలసిందిగా దేవస్థానం విజ్ఞప్తి చేస్తున్నది
మీడియా మాధ్యమాలు— దినపత్రికలు, టీవీ చానళ్ల ద్వారా పై సమాచారాన్ని భక్తులకు విస్తృతంగా తెలియజేయవలసిందిగా కోరడమైనది.
సుజాత ఎన్
డిప్యూటీ కమిషనర్ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం


