ఆడ తోడు కోసం పెద్ద పులి సుదీర్ఘ ప్రయాణం!
TG: యాదాద్రి జిల్లాలో రెండు వారాలుగా పెద్ద పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. రాజాపేట, తుర్కపల్లి, యాదాద్రి మండలాల్లో సంచరిస్తూ లేగదూడలపై దాడులు చేస్తోంది. అటవీశాఖ అధికారులు ఎంత ప్రయత్నిస్తున్నా పులి జాడ కనుక్కోలేకపోతున్నారు. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి నదులు, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాలు దాటుకుంటూ 400km ప్రయాణించి, ఆడ పులి తోడు కోసం వచ్చినట్లు భావిస్తున్నారు. #news #sharechat


