#😇My Status #పొట్టి శ్రీరాములు వర్ధంతి
అమర జీవిగా ప్రజల హృదయాలలో నిలిచిపోయిన, నిష్కలంకమైన వ్యక్తి అని మహాత్మునిచే కీర్తించపడినా అవన్నీ
పొట్టి శ్రీరాములుకే చెందుతాయి.
1901వ సంవత్సరం మార్చి 16న నెల్లూరులో పొట్టి శ్రీరాములు జన్మించారు. చిన్ననాటి నుండే దేశభక్తిని గుండెలలో నింపుకున్న వ్యక్తి. చిన్ననాడు ఉపాధ్యాయులందరి ముందు ధైర్యంగా, బ్రిటీషు వారు మనదేశానికి చేస్తున్న అన్యాయాన్ని ఉపన్యాస పోటీలో వ్యక్త పరిచి పొగడ్తలు, విమర్శలు సమాన స్థాయిలో అందుకున్న వ్యక్తి.
నెల్లూరులో మహత్మాగాంధీ గారి సత్యాగ్రహ విధానంలో 29 రోజులు నిరాహార దీక్ష చేసి హరిజనులకు ఆలయ ప్రవేశం కల్పించారు.
మద్రాసు రాష్ట్రంలో తెలుగు వారికి జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 54 రోజుల పాటు నిరాహర దీక్ష చేసి, 1952 డిశంబరు 15న మరణించారు. ఈయన దీక్ష ఫలితంగా అక్టోబరు 1, 1953న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. సత్యం, అహింస ఎంతటి గొప్ప లక్ష్యాన్ని అయినా సాధించి పెడతాయని మరోసారి నిరూపితం అయింది.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


