#💐నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి🎂
23-01-2026... శుక్రవారం... సేకరించినది
*నేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్
129వ జయంతి శుభాకాంక్షలు *
ఆంగ్లేయులపైకి దూసుకొచ్చిన బుల్లెట్‌గా అభివర్ణించే స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు ఏటా ఘనంగా నివాళులర్పించేందుకే కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆయన జన్మదినమైన జనవరి 23న ప్రతి సంవత్సరం ‘ *పరాక్రమ దివస్* ’గా జరపాలని నిర్ణయించింది.
ఒడిషా రాష్ట్రంలోని ఖాట్గాలో 1897, జనవరి23న ప్రభావతి దేవి, జానకినాథ్ బోస్ దంపతులకు నేతాజీ జన్మించారు. నేతాజీ తండ్రి అడ్వకేట్. జాతీయవాది కూడా అయిన ఆయన బెంగాల్ లెజిస్టేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశారు. చిన్నతనం నుంచి చురుగ్గా ఉండే నేతాజీ రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందల ప్రభావంతో సన్యాసం స్వీకరించారు. మానవసేవే మాధవసేవ అన్న రామకృష్ణుడి ఉపదేశంతో దేశసేవకు నడుంకట్టారు. జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి పలు పోరాటాల్లో భాగస్వామి అయ్యారు.
1920లో ఇండియన్ సివిల్ సర్వీసెస్ కు ఎంపికైనప్పటికీ తృణప్రాయంగా ఉద్యోగాన్ని వదులుకొని దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడమే ధ్యేయం గా ముందుకు సాగిన మహానుభావులు. 🙏🙏

