ShareChat
click to see wallet page
search
#అరుణాచలం మహాక్షేత్రం# #అరుణాచలం సమాచారం *అరుణాచలంలో నివసిస్తున్న సాధువులకు, సాధకులకు ఉదయం నుండి రాత్రి దాకా భోజనాలు ఎక్కడెక్కడ లభించును అనే విషయాన్ని సేకరించి పొందుపరుస్తున్నాము అవసరం ఉన్నవాళ్లు ఉపయోగించుకోండి.* 1. *ఉదయం 5:00 నుంచి 5:30 లోపు శేషాద్రి అశ్రమం దగ్గర్లో తిరువడు దురై ఆటో వస్తుంది. (కామాక్షి గుడి దగ్గరనుండి వరుణ లింగం వరకు వెళ్తుంది) ఈ ఆటోలో వేడివేడి ఇడ్లీ సాంబారు, హెర్బల్ టీ లభించును.* 2. *ఉదయం 7.45 గంటలకు అతిధి ఆశ్రమం ముందు యోగిరాం సూరత్ కుమార్ ఆశ్రమం పక్కన మీనమ్మ అని ఒక ఆవిడ వేడి వేడి ఇడ్లీ చట్నీ సాంబార్ ఇస్తారు. ఇక్కడ ప్లేట్స్ మీరే తీసుకొని వెళ్లాలి.* 3. *ఉదయం 8 గంటలకు యమాలింగం పక్కన టిఫిన్ పెడతారు.* 4. *ఉదయం 8 గంటలకు 63 నాయనర్లు గుడి దాటాక షేడ్ (వరుణ లింగం దగ్గర)లో సుకినోభవ ట్రస్టు వారు వేడివేడి టిఫిన్ అప్పుడప్పుడు ఫ్రూట్స్ ఇస్తారు.* 5. *ఉదయం 8 గంటలకు 63 నాయనర్లు గుడి వారు ప్రసాదం ఇస్తారు.* 6. *ఉదయం 8 గంటలకు వళ్ళలార్ (రమణ ఆశ్రమం డిస్పెన్సెర్ ముందు) నందు టిఫిన్ పెడతారు.* 7. *ఉదయం 7:30 నుండి చంద్ర లింగం దాటిన తరువాత (అధికార నందికి ముందు) కుడివైపు వళ్ళలార్ వాళ్ళు గంజి పొస్తారు.* 8. *ఉదయం 8 గంటలకు సౌత్ గోపురం ముందు వున్న వినాయక గుడిలో గంజి పొస్తారు.* 9. *ఉదయం 9:00 గంటలకు యోగిరాం సూరత్ కుమార్ ఆశ్రమం వారు టిఫిన్ పెడతారు.* 10. *ఉదయం 9:30 గంటలకు రమణ మహర్షి ఆశ్రమం నందు పెరుగన్నం, సాంబార్ అన్నము పెడతారు.* 11. *ఉదయం 11 గంటలకి యమలింగం దాటిన తర్వాత నంది పక్కన రుద్రాక్ష స్వామి వారు Arunachala Rudhraksha Swamiji వారు భోజనం ఇస్తారు.* 12. *ఉదయం 11 గంటలకి రాఘవేంద్ర స్వామి గుడిలో నిత్యగ్ని ట్రస్టు వారు భోజనం పెడతారు.* 13. *ఉదయం 11:15 గంటలకు యోగిరాం సూరత్ కుమార్ ఆశ్రమంలో సాధువులకు (పర్మిషన్ తీసుకున్న వారికి) మాత్రమే భోజనం పెడతారు.* 14. *ఉదయం 11:30 గంటలకు ఆది అన్నామలై గుడిలో భోజనం లభించును.* 15. *ఉదయం 11:30 గంటలకు నీర్ అన్నామలై గుడి వెనకాల జీవ కారుణ్య, వల్లలార్, ఇంకొక ఆశ్రమం వుంది ఈ మూడు ఆశ్రమాలలో భోజనం లభించును.* 16. *12:00 గంటలకు సద్గురు ట్రస్ట్ (సడై స్వామి) నందు భోజనం లభించును.* 17. *12:00 గంటలకి టెంపుల్ దగ్గర గాంధీ బొమ్మ వెనకాల సాదు సదం (సత్రం) గ్రిల్స్ ఉంటాయి అందులో సాధువులకు మాత్రమే భోజనం లభించును ఐదు నిమిషాలు తక్కువ పన్నెండు గంటలకల్లా అక్కడికి వెళ్లాలి నిమిషం అటు ఇటు అయినా లోపలికి రానివ్వరు.* 18. *10:00 గంటలకు అన్నామలై మెయిన్ గుడి భోజనం లభించును దీనికి క్యూ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందే వెళ్లి నిల్చోగలరు.* 19. *12:00 గంటలకు వళ్ళలార్ (రమణ ఆశ్రమం డిస్పెన్సెర్ ముందు) నందు భోజనం పెడతారు.* 20. *12:00 గంటలకు శేషాద్రి ఆశ్రమంలో పెరుగన్నం, సాంబార్ అన్నము లభించును.* 21. *12:00 నుండి చంద్ర లింగం దాటిన తరువాత (అధికార నందికి ముందు) కుడివైపు వళ్ళలార్ వాళ్ళు భోజనం పెడతారు.* 22. *12:30 గంటలకు యోగిరాం సూరత్ కుమార్ ఆశ్రమంలో పెరుగన్నం, సాంబార్ అన్నము లభించును.* 23. *గిరివలం రహదారిలో ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ఆహార వాహనం బండ్లు తిరుగుతూ ఉంటాయి మీకు కనబడినప్పుడు మీరు ఆపి తినవచ్చు.* 24. *పెద్ద గుడి దగ్గర రాజగోపురం ముందు ఎడమవైపు కుడివైపు మెయిన్ రోడ్ లో ఉదయం పూట, సాయంత్రం పూట ఎవరో ఒకరు బండి మీద ప్రసాదం పెడుతూనే ఉంటారు.* 25. *సౌత్ గోపురం ముందున్న రోడ్ లో కామాక్షి గుడి దాటాక వచ్చే ఎడమ పక్క రహదారిలో కొంచెం ముందుకు వెళ్ళాక ఆవులు కట్టేసి ఉంటాయి అక్కడ ఉదయం పూట టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం పూట భోజనం పెడతారు, సాయంత్రం పూట భోజనం పెడతారు.* 26. *గిరి వలం రహదారిలో రోడ్డుకి అటువైపు ఇటువైపు ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి అన్ని ఆశ్రమాలలో అప్పుడప్పుడు (డోనార్స్ వున్నప్పుడు) భోజనం పెడుతూనే ఉంటారు.* 27. *4గంటలకు అతిధి ఆశ్రమం (యోగి రాం సూరత్ కుమార్ ముందు) వాళ్ళు సాధువులకు టిఫిన్ పాకెట్స్ ఇస్తారు.* 28. *సాయంత్రం 5 గంటలకు పలకొత్తు శక్తి అమ్మ గుడి వెనుక చపాతీ కానీ ఇడ్లీ కానీ పాకెట్స్ (పర్మిషన్ తీసుకున్న వాళ్లకు లోపల) ఇస్తారు.* 29. *సాయంత్రం 5 నుండి 63 నాయనర్ ట్రస్ట్ (సద్గురు ట్రస్ట్ ఎదురు, వరుణ లింగం వెళ్ళాక ముందు ఎడమవైపు) వాళ్ళు సాంబార్ రైస్ పెడతారు.* 30. *సాయంత్రం 6 గంటల నుండి సద్గురు ట్రస్ట్ (సడై స్వామి) బండి గిరివలం రోడ్ లో భోజనం పెడుతూ శేషాద్రి ఆశ్రమం వరకు వస్తారు.* 31. *సాయంత్రం 6:00 గంటలకు శేషాద్రి స్వామి వారి హారతి తరువాత ప్రసాదం పెడతారు.* 32. *సాయంత్రం 6:00 నుండి 6:30 గంటల వరకు అగస్తియర్ ఆశ్రమం నందు చపాతీ ఇస్తారు, వీరు ఉదయం 7:00 గంటలకు టిఫిన్ ఇస్తారు, 11:00 గంటల నుండి బోజనం పెడతారు. వీరికి ఇప్పుడు ఫండ్స్ లేవు కనుక చపాతీ మాత్రమే ఇస్తున్నారు.* 33. *సాయంత్రం 7:30 గంటలకు కొడిస్వామి (వరుణ లింగం వెళ్ళాక ముందు ఎడమవైపు) వారు ప్రసాదం పెడతారు.* 34. *యోగిరాం సూరత్ కుమార్ ఆశ్రమంలో మార్నింగ్ నుండి రాత్రి 8 వరకు చిన్న కప్ లో ప్రసాదం పెడుతూ వుంటారు.* 35. *ముక్కు పొడి స్వామి దగ్గర మార్నింగ్ 7:30 కి పొంగలి చిన్న కప్, సాయంత్రం 4కి శెనగలు కప్ ఇస్తారు.* 36. *ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు గిరివలం రహదారిలో పంచముఖ దర్శనం దాటిన తర్వాత టీవీఎస్ షో రూమ్ వస్తుంది ఆ షో రూమ్ ముందు ఇడ్లీ పెడతారు చట్నీ సాంబార్ తో చాలా బాగుంటుంది ఆ సమయంలో ఆ రోజు మీరు అక్కడ ఉంటే ఆరగించవచ్చు.* 37. *ప్రతి మంగళవారం ఉదయం 11 గంటలకి అతిథి ఆశ్రమం పక్క సందులో యోగిరాం శరత్ కుమార్ ఎదురు సందులో ఫార్నర్స్ సాధువుల కొరకు ఫుడ్ పాకెట్స్ ఇస్తారు.* 38. *ప్రతి నేల పునర్వసు నక్షత్రం రోజు రమణ మహర్షి ఆశ్రమంలో 11:00 గంటలకు అందరికీ లోపల బొజనం ఇస్తారు. అలాగే పర్మిషన్ తీసుకున్న వారికి కూడా బొజనం పెడతారు.* 39. *ప్రతి నేల మృగశిర నక్షత్రం రోజు ఈశాన్య జ్ఞ్యాన దిశికర్ ఆశ్రమంలో ప్రసాదం ఇస్తారు. ఈ ఆశ్రమంలో మహేశ్వర పూజ జరిగినప్పుడు అందరికీ బొజనం ఇస్తారు.* 40. *తిరుమంజన (సౌత్) గోపురం నుండి గిరీవలం రహదారిలో కన్మణి మెడికల్ షాప్ దాటాక అమ్మ క్యాంటీన్ వుంది అక్కడ రూపాయికి ఒక ఇడ్లీ, 5 రుపాయాలకు పొంగలి పెడతారు ఉదయం 7:00కి మొదలు అవుతుంది.* 41. *ప్రతి నెల రెండు సార్లు ప్రదోషం జరుగుతుంది సాయంత్రం 6:00 గంటలకు అధికార నంది దగ్గర ప్రసాదం ఇస్తారు.* 42. *ప్రతి నెల రెండు సార్లు ప్రదోషం జరుగుతుంది సాయంత్రం 7:30 గంటలకు సింహా నంది (మౌన స్వామి ఎదురుగా, రాజ రాజేశ్వరీ గుడి దాటాక)దగ్గర రైస్ ఇస్తారు.* *పైన ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో సమయం, స్థలాలు మారవచ్చు. ఇందులో కొన్ని సాధువులు, సాధకులు ముందుగా పర్మిషన్ తీసుకునేవి వున్నాయి. ఇందులో కొన్ని యాత్రికులకు కూడా పెడతారు.* *ఇంకా గీరివలం వెళ్ళేటప్పుడు అపుడప్పుడు ఎవరో ఒక్కరూ ఫుడ్ పెడుతూనే వుంటారు.* *స్పెషల్ రోజులలో ఇంకా చాలా మంది భోజనం పెడుతుంటారు.* *ఎక్కడకు వెళ్ళినా ఒక 15 నిమిషాలు ముందు వుండండి Q వుంటుంది.* *🙏అరుణాచలేశ్వరుడి కృప వల్ల దేనికి లోటు లేదు🙏* *అరుణాచలం శివ* *అరుణాచల శివ* *అరుణాచల శివ* *🙏సర్వోజనాః సుఖినో భవంతు🙏* *┈━❀꧁ఓం నమఃశివాయ꧂❀━┈* *ఆధ్యాత్మిక అన్వేషకులు* 🍁🚩🍁 🔔🕉️🔔 🍁🚩🍁
అరుణాచలం మహాక్షేత్రం# - ShareChat