ShareChat
click to see wallet page
search
🌹🙏 శ్రీ సూర్యనారాయణ...!! 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 శ్రీ సూర్య నారాయణ మేలుకో , హరి సూర్య నారాయణా... పొడుస్తూ భానుడు పొన్న పువ్వు ఛాయా పొన్న పువ్వు మీద పొగడపువ్వు ఛాయా శ్రీ సూర్య ఉదయిస్తూ భానుడు ఉల్లి పువ్వు ఛాయా ఉల్లి పువ్వు మీద ఉగ్రంపు పొడి ఛాయా శ్రీ సూర్య గడియెక్కి భానుడు కంబ పువ్వు ఛాయా కంబ పువ్వు మీద కాకారీ పూ ఛాయా శ్రీ సూర్య జామెక్కి భానుడు జాజి పువ్వు ఛాయా జాజిపువ్వు మీద సంపంగి పూ ఛాయా శ్రీ సూర్య మధ్యాహ్న భానుడు మల్లె పువ్వు ఛాయా మల్లెపువ్వు మీద మంకెన్నఁ పూ ఛాయా శ్రీ సూర్య మూడు ఝాముల భానుడు ములగపువ్వు ఛాయా ములగ పువ్వు మీద ముత్యంపు పొడి ఛాయా శ్రీ సూర్య అస్తమాన భానుడు ఆవపువ్వు ఛాయా ఆవపువ్వు మీద అద్దంపు పొడి ఛాయా శ్రీ సూర్య వాలుతూ భానుడు వంగపువ్వు ఛాయా వంగపువ్వు మీద వజ్రంపు పొడి ఛాయా శ్రీ సూర్య గుంకుతూ భానుడు గుమ్మడి పూ ఛాయా గుమ్మడి పూ మీద కుంకంపు పొడి ఛాయా శ్రీ సూర్య ...🚩🌞🙏🌹 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 . #☀️శుభ మధ్యాహ్నం #🌼ఆదివారం స్పెషల్ విషెస్ #🙏🏻ఆదివారం భక్తి స్పెషల్ #🌞శ్రీ సూర్యనారాయణ స్వామి🌞 #🌞 శ్రీ సూర్యనారాయణ స్వామి 🌞
☀️శుభ మధ్యాహ్నం - ShareChat