🙏🙏Praise the Lord🙏🙏
ఉత్తమమైనది పొందుకోవాలంటే ఓపికపట్టాల్సిందే..🙏🙏
ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు.🗣️🗣️
కొన్నికొన్నిసార్లు జీవితంలో కొన్ని విషయాలు చాలా ఆలస్యం అవుతాయి..😒😒
కొన్ని విషయాలు హమ్మయ్య సర్దుకున్నాయి.. అయిపోతాయి అనుకునేలోపే ఆలస్యం అవుతాయి. కొన్ని ఆగిపోతాయి.☹️☹️
ఎంత భక్తిగా జీవిస్తూ, శ్రద్ధతో ప్రార్ధించినా కొన్ని ఆలస్యము అవుతాయి.😩😩
కొన్నిసార్లు సమయానికి సహాయం అందకపోతే మనసు కలత చెందుతాది,😞😞 హృదయం నొచ్చుకుంటాది,😧😧 మనసంతా వేదన నిండిపోతాది...🥺🥺
అయినా కంగారుపడకు నేస్తమా..🙏🏻🙏🏻
కొంచెం ఆలస్యమైనా కలతచెందకు,🙅🏻♂️🙅🏻♂️ నిరాశపడకు,🙅🏻♂️🙅🏻♂️ విశ్వాసమును, యదార్ధమైన జీవితాన్ని విడచిపెట్టకు..🙏🏻🙏🏻
దేవుని వాక్యము ఈలాగు సెలవిస్తుంది..📖📖
(కొంచెం ఆలస్యమైనా ఎదురుచూడు, ఓపికపట్టు.. ఎందుకో తెలుసా....)
యెహోవా ఉత్తమమైనదానిని అనుగ్రహించును.
యథార్థముగా ప్రవర్తించువారికి ఆయన యే మేలును చేయక మానడు.
Psalms(కీర్తనలు గ్రంధము):85:12;84:11
అవును.✅✅
యథార్ధముగా జీవించువారికి ఆయన ఏ మేలును చేయక మానడు..🙌🏻🙌🏻
ఒక్క విషయం గుర్తుపెట్టుకో..🧏🏻🧏🏻
ఆలస్యమైనా దేవుని మీద ఆధారపడు.🙏🏻🙏🏻
ఆయన నీకు ఉత్తమమైనది(మంచిది) నీకు ఇస్తాడు.✅
ఏదైతే కోల్పోయానని భాధపడుతున్నావో దానికంటే శ్రేష్ఠమైనది దేవుడు ఇస్తాడు.🤩✅
ఎన్ని కష్టాలెదురైనా, ఎన్ని సమస్యలెదురైనా
యధార్ధముగా జీవించు..🙏🏻🙏🏻
ఆయన నీ జీవితంలో నీవు ఊహించని మేలు చేస్తాడు.🙏🏻🙏🏻
దేవుని వాగ్ధానాలు జీవితాలలో నెరవేరడంలేదని కంగారుపడిపోతూ ఉంటాము.🙆🏻♂️🙆🏻♂️
కానీ వాగ్ధానం మన జీవితాలలో నెరవేరాలంటే మనమేమి చేయాలో వాక్యము ఈలాగు సెలవిస్తుంది..📖📖
మీరు దేవుని చిత్తమును నెరవేర్చినవారై, వాగ్దానముపొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై యున్నది.
Hebrews(హెబ్రీయులకు) 10:36
వాగ్ధాన ఫలమును అనుభవించాలంటే మనకు ఓపిక, ఓరిమి చాలా అవసరము. ఓపికపట్టి దేవుని వాగ్ధాన నెరవేర్పు కొరకు ఎదురుచూడగలిగితే ఉత్తమమైన వాగ్ధాన ఫలమును జీవితంలో అనుభవించగలము.🙏🏻🙏🏻
కొన్ని కొన్ని పరిస్థితులు మనలను ఇబ్బందిపెట్టినా మన నీతిని, మన యథార్థతను విడచిపెట్టకుండా జీవించగలిగితే ఆయన చేసే మేలులను మనము తప్పకుండా పొందుకోగలము.✅✅
🔅 దానియేలు ఇశ్రాయేలు రాజ వంశములో పుట్టినప్పటికీ, సకల విద్యా ప్రావీణ్యుడైనప్పటికీ, శత్రువుచేత ముట్టడివేయబడి పరాయి దేశానికి తీసుకునిపోయినప్పుడు తాను ఆ పరాయి దేశానికి ప్రధానమంత్రిగా ఉంటానని గాని, అన్య దేశములో ఘనపరచబడతాననిగాని దానియేలునకు తెలియదు.🤷🏻♂️🤷🏻♂️
కానీ దేవునికి లోబడుచూ, ప్రార్ధన మానక ఓపికతో జీవించాడు, దేవునియొద్దనుండి ఉత్తమమైన జీవితాన్ని పొందుకుని ప్రత్యేకమైన వ్యక్తిగా పరిశుద్ధ గ్రంధంలో నిలిచాడు.🙌🏻🙌🏻
🔅అలాగే యోసేపును జ్ఞాపకం చేసుకుంటే..🧏🏻🧏🏻
అన్నల చేత ద్వేషింపబడినా, గోతిలో ఉన్నా, అన్య జనమునకు అమ్మబడినా, పరాయి దేశములో బంధీగా ఉన్నా, నడివీధులలో పరదేశిగా ఉన్నప్పటికీ దేవునినే నమ్మి దేవుని వాగ్ధాన నెరవేర్పు కొరకు, ఆయన చిత్తముకొరకు కనిపెట్టి, ఓపికతో ఎదురుచూసాడు, ఉత్తమమైనదానిని పరాయి దేశంలోనే పొందుకుని పరాయి దేశాన్ని పాలించే అధికారిగా ఉండగలిగాడు.🙌🏻🙌🏻
మనము కూడా ఏది జరిగినా, ఏది ఎదురైనా దేవుని నమ్మి జీవిస్తే దేవునియొద్దనుండి ఉత్తమమైనదానిని పొందుకోగలము.🙌🏻🙌🏻
కాబట్టి..🧏🏻
దేవుని యెడల యధార్ధతకలిగి జీవించునట్లు మనలను మనము సిద్ధపరచుకుందాం .🙏🏻🙏🏻 జీవితంలో ఎన్ని విషయాలు ఆలస్యం అయినా ఓపికతో ఎదురుచూస్తూ మనము దేవునియొద్దనుండి ఉత్తమమైనదానినే పొందుకుంటామనే విశ్వాసముతో ముందుకు సాగుదాం..
యదార్ధవంతులకు ఏ మేలును చేయకమానని దేవునితో నిశ్చింతగా సాగిపోదాం.
అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్..!! ఆమెన్..!!
God bless you. #✝జీసస్ #✝యేసయ్య ఆదరణ📿 #🔱దేవుళ్ళు #యేసయ్య దీవెనలు #📕బైబిల్ వాక్యాలు


