🌸 ధనుర్మాసం | తిరుప్పావై | పాశురం 26 🌸 🪔పాశురం మాలే! మణివణ్ణా! మార్గళి నీరాడువాన్, మేలైయార్ శెయ్‍వనగళ్ వేండువన కేట్టియేల్, ఞాలత్తైయెల్లాం నడుంగ మురల్వన, పాలన్న వణ్ణత్తు ఉన్ పాంచజన్నియమే, పోల్వన శంగంగళ్ పోయ్‍ప్పాడుడైయనవే, శాలప్పెరుం పఱైయే పల్లాండిశైప్పారే, కోల విళక్కే కొడియే వితానమే, ఆలినిలైయాయ్ అరుళేలోరెంబావాయ్ 🪷భావం: ఇంద్రనీలమణి వర్ణముతో, ఆశ్రితుల పట్ల వ్యామోహ స్వరూపుడవైన ఓ స్వామీ! మార్గశిర మాస వ్రతస్నానమునకు వచ్చాము. మా పూర్వులన్నీ ఈ వ్రతాన్ని ఆచరించారు. ఈ నాడు మేము కూడా అదే పద్ధతిలో కొనసాగుటకు వ్రతానికి కావలసిన పరికరములను నీ నుండి అర్థించుటకు వచ్చాము. భూమండలమంతయు వణుకు కలిగించునట్లు ధ్వనించే పాలవంటి తెల్లని శంఖములు కావాలి — నీ పాంచజన్యమువలె! అతి పెద్ద పఱవంటి వాద్యములు కావాలి. మంగళగానములు పాడే భాగవతులు కావాలి. వ్రత మార్గమునకు ముందుండే మంగళదీపము కావాలి. చాందినీలతో అలంకరించిన విథానములు కావాలి. లోకములన్నిటిని నీ చిరుబొజ్జులో దాచుకుని ఒక లేత వటపత్రంపైన పరుండిన ఓ వటపత్రశాయీ! నీకు చేతకానిదేమున్నది? కరుణించి మా వ్రతము సాంగోపాంగముగా పూర్తియగునట్లు ఈ అన్నిటినీ ప్రసాదించుము.🍀జీవన సందేశం: భక్తి అనేది భావమే కాదు — క్రమము. సంకల్పం నిలబడాలంటే సాధనకు సరైన ఏర్పాట్లు కావాలి. 🌿 వ్రతం మొదలవుతుంది క్రమం ఏర్పడినప్పుడు. #గోదాదేవి తిరుప్పావై
01:00

