#😇My Status #My post# #నవ్వు నవ్వించు: సంక్రాంతి ముగ్గులు: హాస్యకథ:
"ఏమండీ పక్కింటి మీనాక్షి ఈరోజు ఏం ముగ్గు వేస్తుందో కాస్తా చూసిరండి, దాన్ని తలదన్నే ముగ్గును వేసి ఈపోటీలో నేనే గెలవాలి".
అబ్బా ఎన్నాళ్ళకొక మంచిపని చెప్పింది." అని చంకలు గుద్దుకుంటూ వెళ్లి పక్కావిడ వొంగొని సంక్రాంతి ముగ్గేస్తుంటే చలిలో వెచ్చగా రగ్గేసుకొని వచ్చి మీనాక్షితో అలా మాట మాట కలుపుకొని కళ్ళప్పగించి చూస్తూ ఏవేవో జోక్ లు వేస్తున్నాడు సోమనాథం.
ఆ సీన్ చూసి చూసి మీనాక్షి భర్త సహించలేక కుళ్ళుకొని ఆవేశంతో ఆడాళ్ళు పనిచేసుకుంటే ఇక్కడ నీకేం పని అని నిలదీశాడు, వేరే పని లేదా అని గదమాయించాడు. మాట మాటా పెరిగింది. సోమనాథం ముగ్గు, ముగ్గు అని ఏదో చెప్ప బోయాడు. ముగ్గూ లేదు బొగ్గూ లేదు ముందు రగ్గు తీయవయ్యా అని ఎడాపెడా వీపుమీద మెత్తగా వాయించి పడేసాడు మీనాక్షి భర్త.
కన్ను లొట్టబోయినట్టు, బతుకు జీవుడా అన్నట్టు తప్పించుకొని వచ్చి భార్యమీద ఫైర్ అయ్యాడు, "ఇదంతా నీవల్లే జరిగిందని కసురుకున్నాడు. "
"లేక పోతే ఏంటి, పొద్దస్తమానం, మిడిగుడ్లే సుకొని, ఆడదాని మొఖమెరగనట్టు ఆ మీనాక్షిని చూస్తూకూర్చోకపోతే. నీకిలాంటి శాస్తి జరగాలనే పంపించాను." అంది కూల్ గా.
"నిన్ను తగలెయ్య నావొళ్ళంతా హూనం అయిపోయింది కదే" వాపోయాడు సోమనాథం.
By KondaKintali.


