ShareChat
click to see wallet page
search
🚦రోడ్డు భద్రతే లక్ష్యం – సురక్షిత సమాజమే మన గమ్యం : ఎమ్మెల్యే జారె ఆదినారాయణ🚦 22.01.2026 | గురువారం తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం – 2026 కార్యక్రమాల్లో భాగంగా, ఈ నెల 1 నుంచి 31వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా అశ్వారావుపేటలోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం లో కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ➡️ డీజీపీ సతీష్ కుమార్ గారు, ➡️ సీఐ నాగరాజు గారు, ➡️ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నిర్మల గారు, ➡️ దమ్మపేట, అశ్వారావుపేట ఎస్సైలు సాయి కిషోర్ రెడ్డి గారు, యయాతి రాజు గారు, ➡️ అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ విజయ్ గారు హాజరై తమ తమ విభాగాల పరిధిలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు మాట్లాడుతూ – “రోడ్డు భద్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు… ప్రతి పౌరుడి వ్యక్తిగత బాధ్యత” అని స్పష్టం చేశారు. 👉 18 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారు లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం చట్టవిరుద్ధం అని తెలిపారు. 👉 చిన్న నిర్లక్ష్యమే ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. 👉 ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, 👉 నాలుగు చక్రాల వాహనదారులు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా వినియోగించాలి అన్నారు. 👉 మద్యం సేవించి వాహనాలు నడపడం, అధిక వేగం ప్రమాదాలకు ప్రధాన కారణాలని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు లైసెన్స్ లేకుండా వాహనాలు నడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, యువత రోడ్డు నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుత పౌరులుగా మెలగాలని ఆయన పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టం కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగులుస్తుందని, ముందస్తు జాగ్రత్తలతోనే ప్రమాదాలను నివారించవచ్చని ఎమ్మెల్యే గారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం తరఫున గ్రామీణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ – ప్రతి ఒక్కరూ రోడ్డు నియమాలను పాటించి, తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడుకోవాలని కోరారు. #కాంగ్రెస్ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #🔹కాంగ్రెస్ #🌍నా తెలంగాణ #🏛️రాజకీయాలు
కాంగ్రెస్ - రౌరీయరోడ్డశగరశావణోశ్న0-2026  ehinel ప్రాపైసర్ జయశంక5్ తెలంగాడ వ్యవసాయ నిశ్వనిధ్యాల  తేచి-01-01-2026 నుండీ 31-01-20  [వ్రేసా . 009 ~UA~IUS Paoim LEESURIIEETETEETIUILEr சசி ৩@টি ನಂನ್ CE ೊತ್ಥ-೦t೯ ప్రాగానిరీ రర్షణ వర్యరిచేడించి TTT tHHyM రౌరీయరోడ్డశగరశావణోశ్న0-2026  ehinel ప్రాపైసర్ జయశంక5్ తెలంగాడ వ్యవసాయ నిశ్వనిధ్యాల  తేచి-01-01-2026 నుండీ 31-01-20  [వ్రేసా . 009 ~UA~IUS Paoim LEESURIIEETETEETIUILEr சசி ৩@টি ನಂನ್ CE ೊತ್ಥ-೦t೯ ప్రాగానిరీ రర్షణ వర్యరిచేడించి TTT tHHyM - ShareChat