ShareChat
click to see wallet page
search
☀️సూర్యుడు ☀️ అదితి కుమారుడు ఆదిత్యుడు. సూర్యు భగవానుడు ఏడు గుర్రాల రథం సూర్య కాంతి యొక్క ఏడు రంగులను సూచిస్తాయి. వారంలో రోజులు సంఖ్య ఏడు. జ్యోతిషశాస్త్రంలో సూర్యుడు మొదటి గ్రహం. రాశిచక్రంలో పన్నెండు నక్షత్రరాశులలో సింహారాశికి అధిపతి సూర్యుడు. సూర్యుడు రవివారాం లేదా ఆదివారం యొక్క ప్రధాన దేవత. ఉదయం సూర్యుడు రూపంలోను, రాత్రి అగ్ని రూపంలో పురాణ కాలం నుండి సూర్యుని పూజించే వారు. సూర్యుని పూజించే ప్రధాన పండుగలు మకర సంక్రాంతి, రథసప్తమి, మరియు కుంభమేళా. సూర్యుడికి ప్రీతికరమైన తిథి జ్యేష్ట శుక్ల ద్వాదశి, కార్తిక శుక్ల సప్తమి. సూర్యుడి ప్రీత్యర్ధం ఆదివార వ్రతం చేస్తారు. సూర్యుడిని ఆదిత్య హృదయం, సూర్యాష్టకం, సూర్య అష్టోత్తర శతనామావళితో పూజిస్తారు. సూర్యుని ప్రీత్యర్ధం విష్ణుసహస్రనామ పారాయణ, హరి వంశ పురాణం పారాయణ చేస్తారు. గాయత్రీ మంత్రోపాసన, దీక్ష, జపం సూర్యునికి ప్రీతి కలిగిస్తుంది. సూర్యునికి ప్రతి రోజు ఉదయం సూర్య నమస్కారాలు, త్రి సంధ్యలలో సంధ్యా వందనం కూడా చేస్తారు. సూర్యడు ప్రధాన దేవతలు అయిన శివ, బ్రహ్మ మరియు విష్ణువులకు ఒక సారాంశం. బౌద్ధమతం మరియు జైన మతం కూడా సూర్యుడు ఒక దేవతగా కనిపిస్తాడు. . #☀️శుభ మధ్యాహ్నం #🌼ఆదివారం స్పెషల్ విషెస్ #🙏🏻ఆదివారం భక్తి స్పెషల్ #🌞శ్రీ సూర్యనారాయణ స్వామి🌞 #🌞 శ్రీ సూర్యనారాయణ స్వామి 🌞
☀️శుభ మధ్యాహ్నం - ShareChat
00:36