మురుడేశ్వర దేవాలయం,
ప్రతిభకు ఒక ప్రముఖ నిదర్శనం. ఎత్తైన దేవాలయాన్ని (18 అంతస్తులు) చూసినవారు, ఇటువంటి నిర్మాణం ఎలా సాధ్యమయిందని ఆశ్చర్యపోతారు. దేవాలయ పునర్నిర్మాణం పూర్తిగా విశిష్టమయిన పాలరాతితో జరిగింది. మురుడేశ్వర దేవాలయ ఆవరణలో కనబడే ఎత్తైన శివుని పాలరాతి విగ్రహం అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఈ భారీ విగ్రహాన్ని నిర్మించడానికి సుమారు రెండు సంవత్సరాల సమయం పట్టింది. మురుడేశ్వర విగ్రహ ఆవిర్భావానికి సంబంధించిన కథలను తెలియజేసే శిల్పాలు, చిత్రాలు, ఆధునిక భారతదేశంలో అత్యుత్తమ శిల్పకళకు నిదర్శనాలు.
ఈ క్షేత్రం చాలా ప్రాచీనమైనది. ప్రాచీనకాలం నాటి ఈ దేవాలయం కాల ప్రవాహంలో శిథిలావస్థకు చేరుకుంది. ఆ శిథిలావస్థ నుండి, అందరి ప్రశంసలను అభినందనలను అందుకునే స్థితికి రావడానికి ఆర్.ఎన్. శెట్టీ అనే భక్తుడు ముఖ్య కారకుడు. అతని అకుంఠిత దీక్ష, భక్తి, పట్టుదల వల్ల ఈ మురుడేశ్వర దేవాలయ పునర్నిర్మాణం ఎంతో ఘనంగా జరిగింది. 20 అంతస్తులతో కూడిన ఆలయ గాలిగోపురం 249 అడుగుల ఎత్తుతో గంభీరంగా దర్శనమిస్తుంది. గాలి గోపురానికి ఇరుప్రక్కల ఏనుగు ప్రతిమలు నిజమయిన ఏనుగుల వలెనే భ్రమింపజేస్తుంటాయి. ఇప్పుడు ఈ క్షేత్రం ప్రపంచంలోని వారందరినీ ఆకర్షిస్తుంది. అందుకే సంవత్సరమంతా రద్దిగా ఉంటుంది.
మురుడేశ్వరంలో పవిత్రస్నానాలు చేయడానికి అనేక తీర్థాలున్నాయి. బ్రహ్మతీర్థం, కమండల తీర్థం, అగ్నితీర్థం, భీమతీర్థం, దేవతీర్థం, అందులో ముఖ్యమయినవి. ఈ తీర్థాలన్నీ దేవాలయం అవతల నగరంలో వున్నాయి. ఈ తీర్థాలలో, ఇక్కడి సముద్రంలో స్నానం చేయడం వల్ల, ధీర్ఘకాల రోగాలు నయమయి, తమ కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు.
మురుడేశ్వర ఆలయ ప్రాకారంలోనే, ఇతర దేవతల చిన్న మందిరాలు ఉన్నాయి. వాటిలో గణపతి మందిరం, గౌరీమందిరం, దత్తాత్రేయ, సుబ్రహ్మణ్య, అంజనేయ మందిరాలు ముఖ్యమయినవి. ఇక్కడ భక్తులు ప్రతిష్ఠించిన నాగప్రతిమలు కూడా ఉన్నాయి. దేవాలయ ఆవరణలో ధ్వజస్తంభం, నందిమండపం, యజ్ఞమండపం కూడా ఉన్నాయి. దేవాలయమ ప్రాంగణంలోనున్న రావిచెట్టు చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేసి తమ కోరికలను నెరవేర్చమని, చెట్టుకు ముడుపులు కడుతూంటారు. చెట్టునిండుగా ముడుపులను చూడగలం.
ఇక్కడ యాత్రీకులు ఉండడానికి వసతి గృహాలు, హోటళ్ళూ ఉన్నాయి. మురుడేశ్వరాలయం ప్రతి భారతీయుడికి గర్వకారణం. ప్రతీ భారతీయుడు సందర్శించవలసిన పవిత్ర పుణ్యక్షేత్రం ..🙏🙏🙏
నా అదృష్టం ఏంటంటే ఈ 18 అంతస్తులు కూడా వెక్కగలిగాను చుట్టూ సముద్రాలు టెంపుల్ పరిసరాలు అద్భుతంగా ఉన్నాయి ఎటు చూసినా సముద్రము నీవే అద్భుతమై ఆనందమే ఆనంద పైకెక్కి చూడగలగడం..🙏🙏🙏🙏🙏
#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹


