30th December 2025
పుష్య పుత్రదా ఏకాదశి :
ఈసారి ముక్కోటి ఏకాదశి... పుష్యమాసంలో వస్తున్నది. ఈ ఏకాదశికి పుత్రద ఏకాదశి అని పేరుంది. పూర్వం సుకేతుడనే మహారాజుండేవాడు. అతని భార్య చంపక. ఆమె మహాపతివ్రత. పతి సేవను తానే స్వయంగా చేసేది. అతిథి అభ్యాగతుల్ని సేవించేది. అనేక పుణ్యకార్యాలు, వ్రతనియమాలు పాటించేవారు ఆ పుణ్యదంపతులు. కానీ వారికి సంతానం లేదు. ఆ దుఃఖంతో సుకేతుడు తీర్థాలు సేవిస్తూ ఉండగా, ఒక ప్రదేశంలో ఈ రాజుని ఏకాదశీ వ్రతం చేయమని అక్కడి మహర్షులు చెప్పారు. దాంతో రాజు తన భార్య అయిన చంపకతో పాటు నిష్ఠగా ఏకాదశీ వ్రతం చేస్తూ, లక్ష్మీనారాయణుల్ని సేవించారు. ఫలితంగా వారికి ఒక గుణవంతుడైన కుమారుడు కలిగాడు. అతడు పెరిగి పెద్దవాడై కూడా ప్రజలందరిచేతా ఏకాదశీ వ్రతాన్ని నిష్టగా చేయించేవాడు. పుత్రుణ్ణి ప్రసాదించిన ఏకాదశి కనుక ఇది పుత్రద ఏకాదశి అయిందని పురాణవచనం. అలాగే ఒకసారి ఋతవాక్ అనే మునికి రేవతి 4వ పాదంలో కొడుకు పుట్టి దుర్మార్గుడయ్యాడు. వాని క్రూరకృత్యాలకు కారణం రేవతీ నక్షత్రంలో 4వ పాదంలో పుట్టడమే అని భావించి ఆ ముని నింగిలో ఉన్న రేవతీ నక్షత్రాన్ని నేలపై పడమని శపించాడు. ఆ నక్షత్రం ద్వారక సమీపంలో ఉన్న కుముదం అనే కొండమీద పడింది. దాంతో ఆ పర్వతానికి రైవతకం అన్న పేరు వచ్చింది. ఆ నక్షత్రం కొండను తాకేసరికి ఆ ఒరిపికి అక్కడొక చెరువు ఏర్పడింది. దాన్నుండి ఒక అందమైన కన్య పుట్టింది. ఆమెను ప్రముచుడు అనే ముని పెంచాడు. ఆమెయే రేవతి. పెరిగి పెద్దయ్యాక ఆమెకు పెళ్లిచేయాలని ముని అనుకున్నాడు. అప్పుడామె తనకు రేవతీ నక్షత్రంలో పెళ్లి చేయమని మునికి విన్నవించుకుంది. ‘‘ఇప్పుడు ఆ రేవతిని నన్ను తిరిగి నీ తపఃప్రభావంతో ఆకాశంలో నక్షత్రాల్లో చేర్చు. ఆ తరువాత పెళ్లి చెయ్యి మహాత్మా!’’ అని ప్రార్థించింది. పెంచిన మమకారం కొద్దీ ఆ ముని అలాగే చేశాడు. ఆమె తేజాన్ని ఆకాశంలో నక్షత్రాల పక్కన నిలిపి, భౌతికమైన దేహాన్ని ఒక యోగ్యునికిచ్చి పెళ్లి చేశాడు. వారికి రైవతుడు అనే కుమారుడు పుట్టి 5వ మనువు అయ్యాడు. అతడు పుట్టడమూ, మనువుగా లోకపాలన చెయ్యడమూ మొదలైనవన్నీ ఈ ఏకాదశినాడే జరిగాయి. కనుక ఈ ఏకాదశికి పుత్రద ఏకాదశినాడే జరిగాయి. కనుక ఈ ఏకాదశికి ‘పుత్రద’ అన్నపేరు కూడా వచ్చింది. ఈ కథ ‘విభు’డనే పేరుగల ఇంద్రునికాలంలో జరిగింది.
________________________________________
HARI BABU.G
________________________________________ #వైకుంఠ ఏకాదశి🙏 #🚩వైకుంఠ ఏకాదశి🔱ముక్కోటి శుభాకాంక్షలు🙏 #తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం
శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #ముక్కోటి ఏకాదశి


