*నకిలీ మద్యం కేసు.. జోగి రమేశ్‌కు దక్కని ఊరట*
* అమరావతి: నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్‌కు విజయవాడ ఎక్సైజ్ కోర్టులో ఊరట దక్కలేదు. ఏ2 జగన్‌మోహన్‌రావు, ఏ18 జోగి రమేశ్, ఏ19 జోగి రాము బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. కొంతమంది నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. నేటితో రిమాండ్ ముగియనుండటంతో జోగి రమేశ్, జోగి రాము సహా 13 మంది నిందితులను అధికారులు కోర్టుకు తీసుకొచ్చారు. ఈ నెల 31 వరకు నిందితులకు న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది.
#news #politics #apnews #sharechat


