#My post# #😇My Status
#Konda Kintali Stories#
#ఆ పరేషాన్#: మినీ కథ:
"నిన్న కడుపు నొప్పితోవచ్చిన పేషేంట్కి ఎపెండిసైటీస్ అని చెప్పి ఈ రోజు ఆపరేషన్ చేయాలి రమ్మని చెప్పారు కదా డాక్టర్ " డాక్టర్ని నర్స్ అడిగింది.
"అవును ఈరోజు 11గంటలకి ఎప్పాయింట్మెంట్ ఇచ్చాం కదా వస్తున్నారా"? డాక్టర్ అడిగాడు.
"ఆ పేషెంట్ నిన్న ఇంటికెళ్లి వాము వాటర్ తాగితే కడుపునొప్పి తగ్గిపోయిందట, ఆపరేషన్ అవసరం లేదని ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు" అంది నర్స్ డాక్టరుతో.
"ఛిఛి, డామిట్!..యూస్ లెస్ ఫెలోస్. సరే...12గంటలకి ఎపాయింట్మెంట్ ఇచ్చిన ఆ కిడ్ని పేషేంట్ ఆపరేషన్ క్యాన్సిల్ చేయండి". నర్స్ తో చెప్పాడు డాక్టర్ పరేషాన్ అయిపోయి.
"ఎందుకు సార్ "నర్స్
డాక్టరుని అడిగింది.
"లేకుంటే, నీవిస్తావా కిడ్నీ" డాక్టర్ నర్స్ పై తన ఉక్రోషాన్ని వెళ్లగక్కేడు.
By KondaKintali.


