ShareChat
click to see wallet page
search
సాయి బోధలు: శత్రుత్వాలు, జగడాలు విడిచిపెడితే మనకు భగవంతుని రక్ష దొరుకుతుంది. కఠినంగా మాట్లాడడం, మాటకి మాట విసరడం వల్ల మనకి మనమే కర్తలమై, బాధపడతాం. చెడు చేసినవారికి కూడా మంచి చేయగలిగే మనస్తత్వం ఉన్నప్పుడు, ఇతరులనిందలు నిన్ను బాధించవు. అందరినీ ప్రేమించు. ఎవరితోనూ పోరాడకు. ఇతరుల్ని నిందిస్తూ ఉండడం, వారి దుర్గుణాలను చెప్పుకుంటూ ఆనందించడం పరమనీచమైన క్రియలు. ఎవరి పనులు వారికే ఫలితాలిస్తాయి. కనుక ఇతరుల మంచి చెడులు లు వర్ణిస్తూ కాలాన్ని వృధాచేయడం పాపమే. మాటలు శరీరాన్ని గాయపరచవు. కనుక మాటకి మాట సమాధానం చెప్పి గొడవలు తెచ్చుకోవడంవల్ల ఉద్రేకాలు, ఉక్రోషాలు చెలరేగి, తద్వారా మానసికంగా అంతులేని అశాంతి చెలరేగుతుంది. దానితో జ్ఞానసాధనకు అనుగుణమైన, మాసికస్థితి నెలకొనదు. సత్యం కనబడదు.సోమరిగా ఉండవద్దు. పని చేయి. భగవన్నామాన్ని స్మరించు. సద్గ్రంధాలు పఠించు. ఇతరులు మనల్ని అసహ్యించుకుంటున్నప్పుడు , నిందిస్తున్నప్పుడు, ఉక్రోషపడకుండా భగన్నామజపం చేసుకోవడం, ఆ చోటు విడిచిపెట్టడం అవసరం. ప్రతినింద, ద్వేషం, కోపం వంటివి పతన కారణాలే. #🕉 ఓం సాయిరామ్😇 #🙏🏼షిరిడి సాయి బాబా
🕉 ఓం సాయిరామ్😇 - ShareChat