ShareChat
click to see wallet page
search
#వసంత పంచమి *పరిజ్ఞానం* 🔔 *23/01/2026 శుక్రవారం శ్రీ పంచమి / వసంత పంచమి / మాఘశుద్ధ పంచమి విశిష్టత* *ప్ర :వసంతపంచమి అంటే సరస్వతీదేవి జయంతా?* *జ :* *మాఘశుద్ధ పంచమిని సరస్వతీ జయంతిగా ఆరాధించడం అనేది మనకు పురాణాలలో, ఇతర శాస్త్రాలలో కనబడుతున్న అంశం. ఈ మాఘశుద్ధ పంచమికే వసంత పంచమి అని వ్యవహారం ఉన్నది. నిజానికి వసంత ఋతువు చైత్ర మాసంలో వస్తుంది. కానీ శాస్త్రరీత్యా దీనికి శ్రీపంచమి అనే పేరు ప్రసిద్ధిగా కనిపిస్తున్నది. ఈరోజున సరస్వతీదేవి ఆవిర్భావదినంగా* *దేవీభాగవతం, బ్రహ్మవైవర్తపురాణం* *ప్రస్తావిస్తున్న అంశములు. పరమపురుషుని వదనం నుండి సరస్వతీదేవి ఆవిర్భవించింది అని కథ. ఇందులో ఉన్న సంకేతార్థం ఏమిటంటే ఈ జగతి అంతటికీ కారణమైన పరమేశ్వరుడు, విరాట్పురుషుడు... ఆయన వాక్కు, బుద్ధి, జ్ఞానము- ఈ మూడిటి స్వరూపమే సరస్వతి.* *'వాగ్బుద్ధిజ్ఞానాధిష్ఠాత్రి'.* మనం కూడా ఏదైనా పని చేయాలంటే మన నుండి రకరకాలశక్తులు వ్యక్తమవుతుంటాయి. మనకు ఒక పని చేయడానికి *మన వాక్కు, బుద్ధి, జ్ఞానం ఎలా కావాలో... ఈ విశాలమైన విశ్వం సృష్టిస్థితిలయలు చేయడానికి పరమేశ్వరుని కూడా ఒక జ్ఞానము, వాక్కు, బుద్ధి ఉన్నాయి. ఆ బుద్ధి, జ్ఞానరూపంలో ఏ శక్తి ఉన్నదో దానిని మనం సరస్వతి అని ఉపాసన చేస్తున్నాం* . ఆ సరస్వతి మాఘశుద్ధ పంచమినాడు విరాట్పురుషుని నుండి ఆవిర్భవించింది- అని మనకు శాస్త్రం చెప్తున్న వాక్యం. అందుకే ఈరోజున సరస్వతీదేవి ఆరాధన అత్యంత ప్రశస్తిగా ఉన్నది. కేవలం భూలోక మానవులు మాత్రమే కాకుండా దేవలోకంలో వారు కూడా ఈ రోజున సరస్వతీదేవిని ఆరాధిస్తారు అని *దేవీభాగవతం* చెప్తున్నది. కాబట్టి ఈ రోజున సరస్వతీ ఆవిర్భావదినంగా ప్రతివారూ - అందునా విద్యార్థులు, పెద్దవారు అందరూ - కూడా అమ్మవారిని వివిధ విధాలుగా పూజించాలని శాస్త్రం చెప్తున్న విషయం.
వసంత పంచమి - ShareChat