*“దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయుము; యెహోవా గొప్పకార్యములు చేసెను.” యోవేలు 2:21*
ప్రియులారా, పాపం మన జీవితాన్ని బంధిస్తుంచి బానిసను చేస్తుంది. శాపం మన భవిష్యత్తును మూసివేస్తుంది. అయితే దేవుడు “భయపడకుము… నేను గొప్ప కార్యములు చేసెదను.” అంటున్నాడు.
యోవేలు కాలంలో దేశం పాపం వల్ల కరువు, నష్టం, నిరాశ రాజ్యమేలింది. అయితే పశ్చాత్తాపం ఉన్న చోట దేవుని కృప ప్రవహిస్తుంది.
1. పాపం మనిషిని దేవుని నుండి దూరం చేస్తుంది. కానీ దేవుని కృప పాపం కంటే గొప్పది. యేసు క్రీస్తు రక్తము మన పాపాలను కడిగి, మనలను నీతిమంతులుగా నిలుపుతుంది.
2. శాపం నుండి ఆశీర్వాదానికి తీసుకొచ్చే దేవుడు. శాపమును కొట్టివేసి చెడిపోయిన సంవత్సరాలను కూడా పునరుద్ధరించే దేవుడు. “నాశనమైన సంవత్సరాలను మీకు తిరిగి ఇస్తాను”
3. దేవుడు బానిసత్వం నుండి స్వాతంత్ర్యానిస్తాడు. పాప బంధాలన్నీ బానిసత్వమే. కానీ మన దేవుడు విమోచకుడు. అందుకే సంతోషించి గంతులు వేయుము.
యెహోవా గొప్ప కార్యములు చేసాడు అందుకే భయపడక, విశ్వాసంతో నిలబడి, ఆనందంతో దేవుని స్తుతిద్దాం. 🙏
http://youtube.com/post/UgkxseoMcne3mOJDSEG8pj_8bmmevtkLRvEK?si=fUZDhgILwqxrxqgp #💪పాజిటీవ్ స్టోరీస్ #😇My Status #🙆 Feel Good Status #🌅శుభోదయం #✝జీసస్
*Plz Subscribe, Share, Like and Comment*


