#✌️నేటి నా స్టేటస్ నడక, నడతను బాధ్యతగా నేర్పి
మునుముందుకు నేను వెళితే
లోలోన తను మురిసి…
అందనంత ఎత్తుకు నన్ను చేర్చాలని
తన జీవితంతో యుద్ధం చేసి
నా గెలుపు కోసం ప్రతి నిమిషం ఓడిన వ్యక్తి…
తన కలలను నిశ్శబ్దంగా పక్కన పెట్టి
నా భవిష్యత్తును ముందుకు నెట్టిన బలం
తన అలసటను నవ్వులో దాచుకుని
నా ధైర్యంగా మారిన నీడ…
అతడే
నా అడుగులకు దారి చూపిన దీపం
నా విజయంలో కనిపించని సంతకం
నా జీవితానికి అర్థం చెప్పిన తండ్రి.🙏🥰


