ShareChat
click to see wallet page
search
🌿🌼🙏కుక్కే సుబ్రహ్మణ్య స్వామివారి దర్శనం, దివ్యమంగళ నీరాజనం, పురాణ గాథ 🙏🌼🌿 🌿🌼🙏సుబ్రహ్మణ్య స్వామి, వినాయకునితో కలిసి తారకాసురునిపై యుద్ధం చేస్తారు. ఈ యుద్ధంలో అసుర సంహారం జరుగుతుంది. అనంతరం ఇక్కడ విశ్రమించిన స్వామి వేలాయుధాన్ని ధార నదిలో పరిశుభ్రం చేస్తారు. దీంతో ఈ నదిని కుమారధార అని పిలుస్తారు. రాక్షస సంహారం చేసిన కుమారస్వామికి దేవేంద్రుడు తన కుమార్తె దేవసేనతో మార్గశిర శుద్ధ దశమి నాడు వివాహం జరిపిస్తారు. సాక్షాత్తూ స్వామివారి వివాహవేదిక కావడంతో ఈ క్షేత్రం మరింత ప్రాశస్త్యం చెందింది. పశ్చిమ కనుమల్లోని ఏడు పరశురామ ప్రతిష్టాపిత క్షేత్రాల్లో కుక్కే సుబ్రహ్మణ్య ఒకటి కావడం విశేషం🙏🌼🌿 🌿🌼🙏నాగులకు రక్షకుడు🙏🌼🌿 🌿🌼🙏నాగులలో శ్రేష్టుడు వాసుకి. ఆయన క్షీరసాగర మథనంలో కవ్వానికి తాడులాగా వ్యవహరించాడు. గరుత్మంతుడి బారినుంచి రక్షించాలని కోరుతూ ఇక్కడ కొండల్లో కఠోరమైన తపస్సు చేశాడు. తపస్సుకు అనుగ్రహించిన మహేశ్వరుడు అతనికి వరమివ్వాలని సుబ్రహ్మణ్య స్వామిని ఆదేశిస్తారు. దీంతో స్కందుడు వాసుకికి ప్రత్యక్షమై కుక్కే క్షేత్రంలో నాగులకు రక్షణ వుంటుందని వరమిస్తాడు. దీంతో నాగులకు ఇది రక్షణ క్షేత్రమైంది. ఇప్పటికీ ఈ క్షేత్రంలో అనేక వందల సర్పాలను మనం చూడవచ్చు. ఆది సుబ్రహ్మణ్య మందిరంలో అనేక పుట్టలు వుంటాయి🙏🌼🌿 🌿🌼🙏ఆదిశేషు, వాసుకిలపై స్వామివారు🙏🌼🌿 🌿🌼🙏ప్రధాన మందిరంలోని స్వామి ఆదిశేషు, వాసుకిలపైన వుండి పూజలను అందుకుంటారు. సర్పదోష నివారణ పూజలకు ఈ క్షేత్రం ప్రసిద్ధి. సర్పసంస్కార, నాగ ప్రతిష్ట, ఆశ్లేషబలి తదితర పూజలను నిర్వహిస్తారు🙏🌼🌿 ఓం శం శరవణభవ ________________________________________ HARI BABU.G ________________________________________ #ఓం శరవణ భవాయ నమః #🌺 శ్రీ సుబ్రహ్మణ్యస్వామి నమః 🙏🏼 #🌹🙏సుబ్రహ్మణ్యస్వామి 🙏🌹 #హిందూ దేవుళ్ళు * దేవాలయాలు #🌅శుభోదయం
ఓం శరవణ భవాయ నమః - కుక్కే సుబ్రమణ్యస్వాయి దేవస్థానం ದಕ್ಷಿಣ ಕನೃಡ ! 10 0్ ತುಕ್ಕೆ ಶೀ ಸುಬಹ್ಮಣ್ಯ ದೇವಸ್ಥಾನ KUKKE SHRI SUBRAHMANYA TEMPLE =ப Bn orA0TO | కుక్కే సుబ్రమణ్యస్వాయి దేవస్థానం ದಕ್ಷಿಣ ಕನೃಡ ! 10 0్ ತುಕ್ಕೆ ಶೀ ಸುಬಹ್ಮಣ್ಯ ದೇವಸ್ಥಾನ KUKKE SHRI SUBRAHMANYA TEMPLE =ப Bn orA0TO | - ShareChat