పార్టీ సీనియర్ నాయకుడి కుటుంబానికి అండగా నిలిచిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు.
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఉద్యమకారుడు, ములుగు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుసుమ జగదీశ్ కుటుంబానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు అండగా నిలిచారు. పార్టీలో మొదటి నుండి క్రియాశీలకంగా వ్యవహరించిన కుసుమ జగదీశ్ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించారు.
జగదీశ్ కుమార్తె సుకీర్తి మెడిసిన్ చదవడానికి ప్రయత్నిస్తున్న విషయం గురించి పార్టీ నాయకుల ద్వారా కేసీఆర్ గారు తెలుసుకున్నారు. ఆమె మెడిసిన్ చదవడానికి అవసరమైన ఫీజు చెక్కును శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో సుకీర్తికి అందజేశారు. మంచిగా చదువుకోవాలని, కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని సుకీర్తిని ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఉన్నారు.
|| #😇My Status #🌍నా తెలంగాణ #KTRamaRao #ThanneeruHarishRao #🏛️రాజకీయాలు ||
00:19

