🛑*ఇస్రా వ మేరాజ్’ సంఘటన ఎప్పుడు జరిగింది?*
`ఈ విషయంలో (ఇస్లామీయ) విద్వాంసుల మధ్య ఎన్నో అభిప్రాయ భేదాలున్నాయి.`
✒️ *హాఫిజ్ ఇబ్నె హజర్ రహిమహుల్లాహ్ ‘ఫత్ హుల్ బారీ – షరహ్ బుఖారీ’ నందు దీని గురించి పదికి పైగా వేర్వేరు వచనాలను సంగ్రహించారు. దీనిలో ఒక వచనం ఏమిటంటే ఇది హిజ్రత్ (మదీనా ప్రస్థానం) కు 1 సం॥ ముందుగా (రబీఉల్ అవ్వల్ మాసం, దైవ దౌత్యపు 12 సం॥) జరిగింది. ఇది ఇబ్నె సాద్ వగైరా||ల వచనం. ఇదే మాటను ఇమామ్ నవవీ కూడా పూర్తి నమ్మకంతో అన్నారు. ఇబ్నె హజమ్ అయితే దీనిని ఖరారు చేశారు. కానీ దీనిని ఇజ్మా (ఏకాభిప్రాయం)గా అనడం సరైనది కాదు, వీరితో పాటు ఇబ్నె అబీ అజిల్ ఇజ్ హనఫీ కూడా ఈ తేదీనే (అంటే హిజ్రత్కు 1 సం॥ ముందు) పూర్తి నమ్మకంతో పేర్కొన్నారు. (షరహ్ అఖీదా తహావియ : 224 పేజీ)*
🌴 *రెండవ వచనం ఏమిటంటే – ఇది (మేరాజ్ యాత్ర) హిజ్రత్కు 8 నెలలు ముందు (రజబ్ నెల, దైవ దౌత్యపు 12 వ సం||) జరిగింది. ఇక మూడవ మాట ఏమిటంటే – ఇది హిజ్రత్కు 6 నెలలు ముందుగా జరిగింది. నాల్గవ మాట ఏమిటంటే – ఇది హిజ్రత్కు 11 నెలలు ముందుగా జరిగింది. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా సెలవిచ్చారు. (ఫత్ హుల్ బారీ: 7వ సంపుటం, 257వ పేజీ)*
`మౌలానా సఫీవుర్ రహ్మాన్ ముబారక్ పూరీ రహిమహుల్లాహ్ ఈ కాలపు తన ప్రసిద్ధ గ్రంథం ‘అర్రహీఖుల్ మఖ్తూమ్’ లో జీవిత చరిత్రకారుల ఆరు వచనాలను సంగ్రహించారు. దానిలో ఒకటి అల్లామా మన్సూర్ పూరీ రహిమహుల్లాహ్ నుండి సంగ్రహించారు. అదేమిటంటే – ఈ సంఘటన దైవ దౌత్యపు 10వ యేట రజబ్ నెల 27న జరిగింది. కానీ ఆయనే దీనిని సత్యమని నమ్మడానికి తిరస్కరించారు. ఎందుకంటే – ఖదీజా (రదియల్లాహు అన్న) ఐదు పూటలు నమాజ్ విధి (ఫర్జ్) గా నిర్ణయించబడడానికి ముందే అంటే, దైవ దౌత్యపు 10వ యేట రమజాన్ మాసంలో మరణించారు. మరి ఐదు పూటల నమాజ్ అయితే మేరాజ్ యాత్రలో విధిగా నిర్ణయించబడింది. అందుకే ఆయన దృష్టిలో మేరాజ్ యాత్ర ఆమె నిర్యాణం తరువాత జరిగి వుండాలి, ముందుగా కాదు. ఈ ప్రాతిపదిక మీదనే ఆయన (ఖదీజా రదియల్లాహు అన్హ నిర్యాణానికి) ముందుగా ఈ సంఘటన జరిగిందని పేర్కొన్న మరో రెండు వచనాలను కూడా సరైనవి కావని నిర్ధారించారు.`
🔰 *ఇక మిగిలిన మూడు వచనాలు (దైవ దౌత్యపు 12వ యేట రమజాన్ మాసం నందు, దైవ దౌత్యపు 13వ యేట ముహర్రమ్ మాసం నందు, దైవదౌత్యపు 13వ యేట రబీఉల్ అవ్వల్ మాసం నందు) విషయానికొస్తే, ఆయన –* *వీటిలో ఒకదాని మీద మరో దానికి ప్రాధాన్యత ఇవ్వడానికి ఆధారమేదీ లభ్యం కాలేదు అని సెలవిచ్చారు. ఇక దీని గురించి ఆయన మాటల్లో చెప్పాలంటే ఇస్రా సూర అవతరణ పూర్వాపరాలను దృష్టిలో పెట్టుకుని పరిశీలిస్తే ఈ సంఘటన (దైవ ప్రవక్త) మక్కా జీవితం ఆఖరి దశలో జరిగింది.*
(అర్రహీఖుల్ మఖ్తూమ్: 197వ పేజీ)
ఇలా, సత్యానికి దగ్గరగా వుందని మా కనిపించే విషయమేమిటంటే – ఎంతో మహోన్నతమైన ఈ సంఘటన, హిజ్రత్కు 1 సం॥ ముందు రబీవుల్ అవ్వల్ మాసం, దైవ దౌత్యపు 12వ యేడు నందు జరిగింది. దీనికి ఆధారం ఇమామ్ జుహ్రి మరియు ఇమామ్ ఉర్వా బిన్ జుబైర్ ల ఈ మాట – హిజ్రత్ కు 1 సం॥ ముందు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను బైతుల్ మఖ్దిస్ వైపునకు యాత్ర గావించడం జరిగింది. #🤲🏻అల్లా హే అల్లా🕋 #అల్లా అక్బర్ #మాషా అల్లా 🤲🕋 #అల్లా🌠🌙 #అల్లా


