ShareChat
click to see wallet page
search
*🌹 శబరిమలలోని పదునెట్టాంబడి - 18 మెట్లు ఎక్కడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం 🌹* *ప్రసాద్‌ భరధ్వాజ* *తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప ఆలయాలు అయ్యప్ప దీక్ష స్వాములతో మారుమోగుతున్నాయి. 41 రోజుల పాటు అయ్యప్ప మాల ధారణతో ప్రత్యేక పూజలు చేస్తుంటారు.* *అయ్యప్ప భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామి వారిని పూజిస్తారు. ఈ క్రమంలో 41 రోజులు ఇరుముడితో స్వామి వారి సన్నిధికి చేరుకుంటారు. అయితే.. శబరిమల ఆలయంలో 18 మెట్లు ఎక్కి స్వామి వారిని దర్శించుకుంటారు. ఆ 18 మెట్లను 'పదునెట్టాంబడి' అని పిలుస్తారు. 41 రోజుల పాటు నియమ నిష్టలతో కఠోర దీక్షతో ఇరుముడి ధరించిన అయ్యప్ప భక్తులకు మాత్రమే 18 మెట్లు ఎక్కేందుకు అర్హత ఉంటుంది.* *ఎందుకంటే.. ఆ 18 మెట్లకు ఎంతో విశిష్టత ఉంది. అది ఏంటంటే.. శబరిమలలోని పదునెట్టాంబడి (18 మెట్లు) లోతుగా ఆధ్యాత్మిక సారాంశాన్ని కలిగి ఉన్నాయి. మొదటి 5 మెట్లు పంచేంద్రియాలను అదుపులో ఉంచుకోవాలని సూచిస్తాయి. తర్వాతి 8 మెట్లు కామం, కోపం వంటి 8 రాగద్వేషాలను వదిలి వేయాలని చెబుతాయి. ఆ తర్వాత వచ్చే 3 మెట్లు త్రిగుణాలకు (సత్వ,రజో, తమో) ప్రతీకగా ఉంటాయి. చివరి 2 మెట్లు విద్య, అవిద్యలకు ప్రతీకగా నిలుస్తాయి. ప్రతి అయ్యప్ప స్వామి మాలా ధారకుడు నిరంతరం మంచి మార్గంలో నడవాలనే సందేశాన్ని ఈ మెట్లు అందిస్తాయి.* 🌹🌹🌹🌹🌹 *Join and Fallow* https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D https://www.facebook.com/share/1bBuRvQkj3/ https://t.me/Spiritual_Wisdom https://youtube.com/@ChaitanyaVijnaanam https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h https://aratt.ai/@chaitanyavijnanam #Ancient Wisdom Teachings #ChaitanyaVijnaanam YouTube channel #చైతన్య విజ్ఞానం spiritual wisdom #ధనుర్మాసం #అయ్యప్ప
Ancient Wisdom Teachings - VNAAN ITANYA శబరిమలలోని పదునెట్టాంబడి 18 ನೆಲ್ಲು ಎಕ್ಹಡಂನನುತ  CoNCIOU ఉన్న ఆధ్యాత్మికరహస్యం ప్రసాది భరధ్వాజి: VNAAN ITANYA శబరిమలలోని పదునెట్టాంబడి 18 ನೆಲ್ಲು ಎಕ್ಹಡಂನನುತ  CoNCIOU ఉన్న ఆధ్యాత్మికరహస్యం ప్రసాది భరధ్వాజి: - ShareChat