*హఠత్తుగా వ్యాధిబాధలు, కరవుకాటకాలు, నష్టాలు వస్తే*...!!
*హఠాత్తుగా ఆ దేశం మీదకి కరువు వచ్చి పడింది. జీవనం దినదిన గండంగా మారింది. పూట గడవడం కష్టమైపోయింది. కుటుంబాన్ని పోషించవలసిన భర్తకు మిగిలింది ఒకే ఒక ప్రశ్న ఇప్పుడు ఏం చేయాలి? ఎలా కుటుంబాన్ని పోషించాలి? ఏం చేయాలో పాలు పోలేదు. తన ముందు ఏ మార్గము కనబడని సందిగ్ద పరిస్థితి! ఈ పరిస్థితిలో మీరుంటే ఏం చేస్తారు? మీరు క్రైస్తవులైయుండి హఠాత్తుగా మీ ఇంటిమీదికి కష్టమో, కరువో, ఆర్థిక ఇబ్బందో వచ్చి పడితే మీరు ఏ విధముగా దానిని ఎదుర్కొంటారు? అతనేం చేశాడంటే... మూటాముల్లె కట్టుకుని, ‘బెత్లెహేము’ (అంటే రొట్టెల ఇల్లు)ను విడిచిపెట్టి శాపగ్రస్తమైన, దైవ భయమ లేని అన్య దేశమైన మోయాబు దేశానికి ప్రయాణమయ్యాడు. (రూతు 1:1-4) బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు. ఎందుకు రొట్టెల ఇంటికి కరువు వచ్చి పడింది? ఇశ్రాయేలును కాపాడుచు కనుకక నిద్రపోక అనుదినము వారి భారము భరించు దేవున్ని కలిగియుండి కూడా ఎందుకు ఆ దేశానికి కరువు? కారణం: ‘‘ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను’’ (న్యాయాధి 21: 25). దాని తరువాత వచనమే (రూతు 1:1)లో న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలుగగా....*
*అవును, ఎప్పుడైతే మనుష్యులు తమ ఇష్టానుసారముగా దేవునియందు భయభక్తులు లేకుండా జీవిస్తారో తమ కుటుంబాల్లో, వారి పనిపాటల్లో దేవునికి చోటివ్వకుండా వారికిష్టం వచ్చినట్లు జీవించినప్పుడు కరువులు, ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు, వ్యాధులు హఠాత్తుగా వచ్చి పడతాయి. ‘‘ఆకాశామా ఆలకించుము భూమీ చెవియొగ్గుము- నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని వారు నా మీద తిరుగబడి యున్నారు. ఎద్దు తన కామమందు నెరుగును, గాడిద తన సొంతవానిని దొడ్డి తెలిసికొనును. ఇశ్రాయేలుకు తెలివిలేదు, నాజనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానామా, చెరుపుచేయు పిల్లలారా మీకు శ్రమ. వారు యోహోవాను విసర్జించి యున్నారు. ఆయనను విడిచి తొలగిపోయి యున్నారు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి గలిగియున్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యెను. అరికాలు మొదలుకొని తలవరకు స్వస్థత కొంచెమైనను లేదు.’’ (యెషయా 1:2-6).*
*‘‘మీరు విస్తారముగా విత్తినను మీకు కొచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా వున్నది’’ (హగ్గయి 1:6) ‘‘మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి’’ అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. (హగ్గయి 1:7) గమనించారా? మన ఇష్టానుసారముగా జీవించినప్పుడు దేవునికి వ్యతిరేకముగా బ్రతికినప్పుడు మన జీవితాలు మనకు తెలియకుండానే కష్టాలపాలౌతాయి. నష్టాలు కొనితెచ్చుకుంటాము. యెహోవా సెలవు లేక భోజనముచేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? (ప్రసంగి 2:25) ఆయన సెలవులేక ఆయన కృపలేకుండా ఈ లోకంలో ఏ జీవి మనజాలదు. ‘‘తగిన కాలమున నీవు వాటికి ఆహారమిచ్చెదవని ఇవన్నియు నీ దయకొరకు కనిపెట్టుచున్నవి. నీవు దయకొరకు కనిపెట్టుచున్నవి. నీవు నీ గుప్పిలిని విప్పగా అవి మంచివాటిని తిని తృప్తి పరచబడును. నీవు ముఖము మరుగుచేసికొనగా అవి కలతపడును. (కీర్తన 104: 274-29) సర్వసృష్టి ఆయన దయమీద ఆధారపడి బ్రతుకుతుంటే స్వేచ్ఛాజీవి అయిన మానవుడు దేవుడు లేకుండా ఏవో సాధించాలని, ఏదైనా సాధించాలని, ఏదైనా సాధించగలనని భ్రమ చెందుతున్నాడు. ఆ భ్రమలోనే జీవిత పరమార్ధము తెలుసుకొనక దేవునిమీద ఆధారపడి సుఖవంతమైన జీవితాన్ని గడపక తనువు చాలించుచున్నాడు.*
*బెత్లెహేమునుండి దేవునికి దూరమై మోయాబు దేశానికి బ్రతకాలని వెళ్ళిన ఎలీమెలెకు తన భార్యను ఇద్దరు కుమారులను దిక్కుమాలిన వారిని చేసి చనిపోయాడు. తండ్రిని అనుసరించిన కుమారులు చివవరకు తమ ఇద్దరు భార్యలను దిక్కులేని వారిగాచేసి వారూ చనిపోయారు. బెత్లెహేము విడిచి దేవునికి దూరమై ప్రాణాలు పోగొట్టుకొనిన వీరినిచూసి జాగ్రత్త పడదాం. మనకు కరువు సంభవిస్తే, కష్టమువస్తే దానినుండి తప్పించుకోడానికి ప్రయత్నించక, అవి వచ్చిన కారణాన్ని గ్రహించి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి జవాబు పొందుకుందాం. చివరికి దేవుడు దయతలచాడు. నమోమి పెనిమిటి లేనిదాయెను. ‘‘వారికి ఆహారమిచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె (నయోమి) మోయాబు దేశంలో వినెను. గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. (రూతు 1:6-7) దిక్కులేని వారిని, కృంగిపోయిన వారిని, దర్శించి వారికున్న అక్కరను తీర్చేది మన ప్రభువైన యేసుక్రీస్తే. కనుక ఆయన్నే ఆశ్రయిద్దాం. మన కష్టాలు విడిచిపెట్టి ఆయన ఇష్టానుసారముగా జీవించి, ఆయన కరుణా హస్తాలక్రింద సుఖవంతంగా జీవిద్దాం. నా అంతట నేను ఏమియు చేయలేను. (యోహాను 5:30) అని ప్రభువే అంటుంటే దేవుడు లేకుండా మనమేమి చేయగలం?*
___________________________
*ప్రతిదినం పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నారా? అయితే మీ కోసమే ఈ గ్రూప్స్...!*
*WhatsApp Community - 1 link:*
https://chat.whatsapp.com/BKEcChdxaKrK0dJ8CqADcD
***************************************
*Telegram group Link*
https://t.me/+XtII92fKOXAyNWQ9
********************************
*యూట్యూబ్ ఛానల్ లింకు*
https://www.youtube.com/@calvarykiranalu-l7t
********************************
*మీ ప్రార్దన అవసరతను నా నెంబర్ కు మెసేజ్ చేయండి.... మీ ప్రార్దన మనవిని మన అన్నీ గ్రూప్స్ లో నేనే పోస్ట్ చేయడం జరుగుతుంది. మీ సమస్యపై మన గ్రూప్స్ సభ్యులందరూ ప్రార్దన చేస్తారు. మనకు కావల్చింది వాక్యం, ప్రార్దన.*
*- మీ సహోదరుడు మోషే*
*- (Calvary Kiranalu )*
*-(📲 9550576444)*
************************************
#JESU I LOVE YOU JESUS #jesu #యేసు ప్రభువు #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #i love jesu #Jesus


