#🎺రిపబ్లిక్ డే పరేడ్🇮🇳 *రిపబ్లిక్ డే శుభాకాంక్షలు*
బానిసత్వం నుండి బయటకు వచ్చిన ఆనందం ఆవిరవుతుంటే..
మారని బ్రిటిష్ చట్టాల పరిపాలనతో జనం గుండెల్లో భయం దౌడు తీస్తుంది..
దేశహితం కోరే నాయకులను తప్పించి దోపిడీ దొంగల ముఠా.. గుట్టుగా అధికారం అందలమెక్కి సామాన్యుల జీవితానికి
దక్కని ఆర్థిక సామాజిక భద్రత..
ఎట్టకేలకు 1956జనవరి 26న భారత రాజ్యాంగం రిపబ్లిక్ డే..
ఎర్రకోటపై జాతీయజెండా రెపరెపలతో భారతీయత వెల్లివిరిసిన రోజు..
ప్రజలే ప్రతినిధులు పాలకులని మురిసిన రోజు..
అధికారుల కనుసన్నలలో ప్రజాహితమే పరమార్థంగా నడవాలని..
ప్రతి భారతీయుడు ఆశగా
ఎదురు చూసిన రోజు..
మువ్వన్నెల జెండా రెపరెపలు ముజ్జగములు కనిపించిన రోజు..
ప్రతి భారతీయుడి ముఖంలో చిరునవ్వుల వెలుగులు విరజిమ్మిన రోజు..
జయజయ ప్రియ భారతమాత నినాదం దిక్కులు దద్దరిల్లే రోజు..
నిజమైన గణతంత్ర దినోత్సవ సంబరాలు అంబరాన్ని
తాకే శుభ క్షణం..!
గోవర్ధన్ ఆముదాలపల్లి #⛳భారతీయ సంస్కృతి #షేర్ చాట్ బజార్👍


