నన్ను ప్రాణ సమానంగా ప్రేమించే వారు నాకు కరువు. ఇట్టి వారు నాకు ఒక్కటి ఇస్తే, నేను వారికి నూరింతలు ఇస్తాను
శిరిడీ సాయి బాబా
బాబావారి అవతారం ప్రేమావతారం. ఇలాంటి సుందర మధుర మనోహర అవతారం ఇంతవరకూ రాలేదు, ఇక రాబోదు. సఛ్ఛరిత్ర మొత్తం అధ్యయనం చేస్తే 2,700 కు పైగా ప్రేమ అనే పదాన్ని హేమాద్రిపంత్ ప్రయోగించారు. సాయి అడుగుతున్నది, మన నుంచి కోరుతున్నది ప్రేమనే, మనం ఇవ్వలేనిది అదే.
బాబా రూపం చూడండి, అతి సామాన్యంగా ఉంటుంది. చినిగిన వస్త్రాలు, తలకు ఓ రుమాలు, చేతిలో సటకా, ఓ బిక్షపాత్ర. మరి అలాంటి ఆయన దగ్గర మనం ఎంత భిక్ష మెత్తుతున్నామో కదా! ఆలోచిస్తే పొంతన కుదరదు.
బాబా వేపచెట్టు క్రింద మనకోసం వెలసివ వేద వేద్యుడు. తలపైన పాగాలో అష్టసిధ్ధులు, భుజానికున్న జోలెలో అష్ట లక్ష్ములు. ఆయన మన ఆది భవ వ్యాధులను నిరంతరం ద్వారకామాయి ధునిలో వేసి నశింపచేస్తూ ఉంటారు.
ఈ ప్రపంచంలో ఒకరికి ఒకరు తోడున్నారు. నాకు అల్లాయే అల్లాహ్ అంటుంటారు. అంటే మనమంతా ఆయనపై తండ్రి వాత్సల్యం చూపిస్తారేమోననే చిన్న ఆశతో ఆయన ఎదురు చూస్తున్నారు.
ఓం సాయిరాం #🎶భక్తి పాటలు🔱 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🌅శుభోదయం #🙏🏼షిరిడి సాయి బాబా #🕉 ఓం సాయిరామ్😇


