ShareChat
click to see wallet page
search
#😇My Status #భోగి శుభాకాంక్షలు #భోగ భాగ్యలిచ్చే భోగి *భోగ భాగ్యలిచ్చే 'భోగి'..!* *రేపే భోగి 13-01-2026* తెలుగు ప్రజలు అత్యంత ఆనందోత్సవాల మధ్య జరుపుకునే పండుగలలో ఒకటి సంక్రాంతి. ఈ పండుగ మూడు రోజులు ఉంటుంది. తొలి రోజు 'భోగి'తో ప్రారంభమవుతుంది. పుష్యమాసంలో, హేమంత రుతువులో, శీతగాలులు వీస్తూ.. మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చేది మకర సంక్రాంతి. ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. మకర సంక్రాంతి రోజున, సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. ఈ రోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు తెలుపుతున్నాయి. సంక్రాంతి పండుగ ముందు రోజును భోగి అంటారు.'భోగి' రోజున కొన్ని రకాల కూరగాయలు, పాలు పోసి పులగాలు (పొంగలి) వండుతారు. ఈ భోగి రోజే గొచ్చి గౌరీవ్రతాన్ని ప్రారంభిస్తారు. భోగినాటి సాయంకాలం వేళ ఇంట్లో మండపాన్ని నిర్మించి అలంకరిస్తారు. ఆ అలంకరణలో పండ్లు, కూరగాయలు, చెరకు గడల లాంటివి వాడుతారు. మండపం మధ్యలో బియ్యం పోసి దాని మీద బంకమట్టితో చేసిన గౌరీ ప్రతిమను ఉంచుతారు. పూజ పూర్తి అయిన తర్వాత గౌరీదేవికి మంగళ హారతులు పాడి ఆ రాత్రికి శయనోత్సవాన్ని చేస్తారు.ఆ మరునాడు అంటే మకర సంక్రాంతి నాడు ఉదయం సుప్రభాతంతో దేవిని మేల్కొలుపుతారు. ఇలా మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో సాయంకాలం వేళ ముత్తైదువులను పేరంటానికి పిలుస్తారు. నాలుగో రోజు గౌరీదేవికి పూజ అనంతరం ఉద్వాసన చెబుతారు. మంటపానికి అలంకరించిన కూరగాయలను 4 వ రోజున కూర వండుతారు. ఇలా చేసిన కూరనే గొచ్చికూర అని అంటారు. ఆ తర్వాత గొచ్చి గౌరి ప్రతిమను చెరువులో గానీ, నదిలో కానీ నిమజ్జనం చేస్తారు. భోగి రోజు ప్రారంభమైన ఈ వ్రతాన్ని కొంతమంది 4 రోజులు, మరికొంతమంది 6 రోజులు చేయడం కూడా ఆచారం. 'భోగి' రోజు బొమ్మల కొలువు పెట్టడం కూడా వ్రత విధానంగానే ఆచరిస్తారు. అలాగే భోగి పండుగ రోజు చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోయడం లాంటి వాటితో, పేరంటాలతో కళకళలాడుతూ ఉంటుంది. ఇంద్రుడు ప్రీతికోసం ఈ పండుగ జరుపుతుంటారు.'భోగి' మంటలు'భోగి' జనవరి 13 న వస్తుంది. ఈ రోజు తెల్లవారక ముందే.. 3.30 నుంచి 4.00 మధ్య సమయంలో 'భోగి' మంటలు వెలిగిస్తారు. దీనిని సంవత్సరంలో ఆ కాలంలో చలిని ప్రాలదోలడమే కాకుండా, ఇంకో సందర్భముగా కూడా జరుపుకుంటారు. ఇంట్లో ఉండే పాత చీపుర్లు, తట్టలు , విరిగిపోయిన బల్లలు వగైరా మొత్తం పోగు చేసి వీటితో బోగి మంటను వెలిగిస్తారు. దీని ద్వారా కొత్త వాటితో నిత్య నూతన జీవితం ఆరంభించడానికి గుర్తుగా కూడా ఈ రోజు 'భోగి' మంటలు వెలిగిస్తారు.కొందరి ఇళ్లలో 'భోగి' రోజు సాయంత్రం పూట చిన్న పిల్లల బొమ్మలు కొలువును ఏర్పాటు చేస్తారు. బొమ్మలు కొలువులో పిల్లల వివిధ రకాల ఆట వస్తువులని ప్రదర్శనగా ఉంచి ఆనందిస్తారు. మరికొంత మంది భోగి పళ్ళ పేరంటం చేస్తారు. ఇక్కడ పేరంటాళు మరియు బంధువులు సమావేశమై , రేగి పళ్ళు, శనగలు, పూలు, చెరుకు గడలు, కొన్ని నాణాలను కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు. ఈ పేరంటానికి వచ్చిన వారికి తాంబూలాలతో పాటు పట్టు బట్టలు, పసుపు, కుంకుమలు పెట్టడం ఆనవాయితీ..
😇My Status - ৪ষ ATTu Bhogy  ৪ষ ATTu Bhogy - ShareChat