ShareChat
click to see wallet page
search
#మీకు మీ కుటుంబ సభ్యులకూ భోగి మరియు సంక్రాతి పండగ శుభాకాంక్షలు # #🔥భోగి శుభాకాంక్షలు🌾 #🌾మా ఊరి సంక్రాంతి సంబరాలు🏡 #హ్యాపీ భోగి పండగ శుభాకాంక్షలు గోదా భోగమే భోగి... 🙏 గోదా అంటే వాక్కును, వస్త్రములను, అద్దమును, విసనకర్రను, ధనమును, జ్ఞానమును, సేవను ఇచ్చునది అని సంగ్రహంగా ఏడు అర్థాలు. మన వాక్కును, మనస్సును, శరీరాన్ని, బుద్ధిని, చిత్తాన్ని, ఒక్క మాటలో మన మొత్తాన్ని పరమాత్మకిచ్చు జీవాత్మే గోదా. దొరికిన రెండు పువ్వులు వేసి వచ్చిన నామాలు చెప్పి పరమాత్మకు మనల్ని మనం అర్పించుకోవాలి అనే మూడు ముక్కలను ముప్పై పాశురాలలో చెప్పి మూడు లోకాలను ముక్తి మార్గంలో నడిపించి మురిపించిన తల్లి గోదా. జీవాత్మ పరమాత్మను చేరుటయే గోదా కళ్యాణం. భోగి పండగ సందడి తెలుగు లోగిళ్లలో ప్రవేశించింది. ఈ పండగకు భోగి అనే పేరు ఎందుకు వచ్చిందనే సందేహం రావచ్చు. దీనికి రకరకాల కారణాలను తెలుపుతారు. వ్యవసాయదారులు పంటలను ఇళ్లకు చేర్చుకుని విశ్రాంతితో భోగం అనుభవిస్తారు కనుక దీనికి భోగి అనే పేరు వచ్చిందని చెబుతారు. అయితే విజ్ఞులు దీనికి మరో కారణాన్ని, అంతరార్థాన్ని, ప్రాశస్త్యాన్ని వివరిస్తున్నారు. గోదాదేవి నెల రోజులు వ్రతం చేసి రంగనాథుడిని వివాహ మాడి ఆ స్వామి చెంతకు చేరి భోగము అనుభవించిన రోజు భోగి అంటారు. నూటికి తొంభై మంది భోగి మంటలు చలి తీవ్ర తను తట్టుకోలేక వేసుకునేవి అనుకుంటారు. ఆ మంటలలో ఇంట్లోని పాత వస్తువులను ముఖ్యంగా కలపను వేయడం ఆచారం. అందులోని ఆంతర్యాన్ని నిశితంగా పరిశీలిస్తే అగ్ని అంటే జ్ఞానమని పండితుల నిర్వచనం. కలప అంటే అజ్ఞానం. అనగా జ్ఞానంలో అజ్ఞానాన్ని తగులబెట్టడం భోగి మంట. అజ్ఞానం, ఆరాటం, ఆశ, తుచ్చ అనుభవం, విపరీత ప్రవృత్తి, భ్రమ ఇవి మనలో ఉన్న కలపలు, వీటన్నింటిని జ్ఞానరూపమైన భగవంతునిలో దహింప చేయడమే భోగిమంట చెప్పే సందేశం. ప్రస్తుతం ఉన్న అజ్ఞానం తరువాత కలుగబోయే అజ్ఞానపు ఆలోచనలు అన్నీ కూడా దహింప చేయవలసినవే. ఇందులోని పరమార్థం స్వార్థాన్ని దహింప చేయడమే ఇతరుల ఇళ్ళల్లోని కలపను కూడా భోగి మంటల్లో వేసే ఆచారం ఉంది. అనగా వారికి ఇష్టం ఉన్నా లేకున్నా వారి అజ్ఞానాన్ని కూడా పోగొట్టే ప్రయత్నం చేయాలి, అపడు స్వార్థానికి తావుండదు. భోగి పండుగ రోజు ఐదు సంవత్సరాల లోప పిల్లలకు రేగి పళ్లు, చెరుకు గడలు, కొత్త పంటగా వచ్చిన బియ్యం, నాణేలు, బెల్లం కలిపి భోగిప
మీకు మీ కుటుంబ సభ్యులకూ భోగి మరియు సంక్రాతి పండగ శుభాకాంక్షలు # - Ramesh ٥ ٤٤ ٠ Ramesh ٥ ٤٤ ٠ - ShareChat