*✳️ ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము 📖*
╭┄┅┅─══════════════─┅┅┄╮
🌊 *బండసందులలో జీవజలములు* 🌊 ╰┄┅┅─══════════════─┅┅┄╯
యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. హబక్కూకు 3:2.
"o Lord revive thy work in the midst of the years mame known; Habakkuk 3:2
*💥 నూతన పరచుము దేవా నీ కార్యములు మా యెడల...💥*
Renew, O God Your Work's Among Us
నా ప్రియ స్నేహితులారా ! 2025 గడిచిపోయిన సంవత్సరం. ఇప్పుడు 2026వ సంవత్సరం వచ్చింది. గనుక 2025 వెనక విడిచిపెట్టబడింది, అది పాత సంవత్సరం విడిచి పెడితే గాని నూతన సంవత్సరం రాదు.
ప్రభువు నందు నా ప్రియులారా! నేడు ఈ సందేశము చదువుచున్న మీ అందరితో దేవుడు సెలవిస్తున్న మాట మీ యెడల నా కార్యములు జరిగించెదను.. నూతన సంవత్సరంలో మిమ్ములను ఆశీర్వదించి, మీ పక్షముగా నూతన కార్యాలు చేయాలని ప్రభువు కోరుచున్నాడు.
హబక్కూకు 3:2. లో భక్తుడు అంటున్నాడు "యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము." అంటే నూతన సంవత్సరం లోనికి మనం వెళ్తున్నప్పుడు దేవుని కార్యా ములతో కూడ నూతనంగా ప్రవేశిస్తాము అందుకు ప్రభువు ఈ విధముగా అన్నారు.
"ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను" యెషయా 43:19. మనము నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నప్పుడు దేవుడు తప్పకుండ మన జీవితంలో నూతన కార్యాలు ప్రవేశపెడతారు. ఆ నూతన క్రియ మన జీవితంలో జరగాలి అంటే. పాతవి తొలగిపోవాలి. జరిగిపోయిన విషయాలు ఎంత బాగా గుర్తున్నాయో జరగబోయే వాటిని కూడ అంత బాగా తెలుసుకునే దేవునికి వాటిని ప్రకటించడంలో ఏ సమస్య లేదు.
*📖 మనం బైబిలును నిర్లక్ష్యం చేస్తే సజీవ దేవుని వాక్కును నిర్లక్ష్యం చేస్తున్నామన్న మాట. భవిష్యత్ వాక్కులు మనకు తెలియకపోతే దేవుడు ఈ భూమిపై ఏమి చేయనున్నాడో మనకు తెలియదు.*
నేడు చాలా మంది క్రైస్తవులు, నేను ఒకప్పుడు గొప్ప ప్రార్థనా పరుడను, దేవుడు నా జీవితంలో ఈ గొప్ప కార్యం చేసారు అంటు గతంలో జరిగిన సాక్ష్యాలు చెప్తువుంటారు. మంచిది ఒకరిని బలపరచటానికి, ఒకరికి దేవుని కార్యాలు గురించి చెప్పటానికి, దేవున్ని మహిమ పరచటానికి ఈ సాక్ష్యాలు ఎంతో ఉపయోగకరంగా వుంటాయి. కాని అదే సాక్ష్యాన్ని పట్టుకొని తృప్తి పడిపోకూడదు, ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునితో సంబంధం బాగుంది అని తృప్తి చెందుతు చల్లారిపోయే స్థితిలో వుండకూడదు.
బాలుడు ఎదుగుచునప్పుడు అతని స్థితి మారుతు వుంటుంది. 1వ తరగతి చదివేవాడు మరుసటి సంవత్సరం 2వ తరగతికి వెళ్తాడు. 5వ తరగతి చదివేవాడు మరుసటి సంవత్సరం హైస్కూల్ కి వెళ్తాడు, 10వ తరగతి చదివేవాడు మరుసటి సంవత్సరం కాలేజీ కి వెళ్తాడు...ఇలా సంవత్సరములు జరుగుచున్నకొద్ది అతని స్థితి పెరుగుతుంది ఎదుగుదల కనిపిస్తుంది ఇలా పెరుగుతున్నప్పుడు ఒక తరగతి నుండి ఇంకో తరగతికి వెళ్లటానికి పరిక్ష పెడతారు. ఈ పరిక్ష పాస్ అయితేనే పై తరగతికి వెళ్లటానికి అవకాశం వుంటుంది. 10వ తరగతి పాస్ అయితేనే కాలేజీ కి వెళ్తాము. లేకుంటే ఆ స్థితిలోనే వుండిపోతాము.
10వ తరగతి 1st క్లాస్ పాస్ అయి ఇంటర్ ఫైయిల్ అయితే , నేను 10వ తరగతి 1st క్లాస్ పాసయ్యాను అని చెప్పుకోవటం వల్ల ఉపయోగం లేదు. నీ ఎదుగుదల అక్కడితో ఆగిపోతుంది.గనుక మన ఎదుగుదల మన చేతిలో వుంది.
ప్రియులారా ! మన ఆత్మీయ జీవితం కూడ ఇటువంటిదే. సంవత్సరములు గడుచుచున్న కొద్ది మనలో ఎదుగుదల కనపడాలి, దేవుని యొక్క కార్యాలు కుడ నూతనంగా కనపడాలి", As the years pass by, there shall be growth in us, God should be seen us ".....దేవుడు మన జీవిత కాలానికి కావలసిన మేలులన్ని ముందే దాచి యుంచారు. అవి మనకు ఇవ్వటానికి ఒక పరిక్ష పెడుతూనే వుంటారు . ఈ పరిక్ష పాస్ అయితే ఆ మేలు నీకు ఇవ్వబడుతుంది. ఈ మేలు దేవుని కార్యంగా మలచబడుతుంది ...ఈ నూతన కార్యం ఆ సంవత్సరం లో నీకు ఆశీర్వాదకరంగా వుంటుంది. నీ ద్వారా దేవుడు తన నామాన్ని మహిమ పరచుకొంటారు...హల్లేలుయా
ఎవరన్న మాకు పరిక్ష పెట్టలేదు అన్నారంటే వాళ్లు క్లాస్ కి రావటం లేదు. దేవుని సన్నిధికి రావటం లేదు, దేవునికి తమ జీవితాలను సమర్పించుకోలేదు, తమ ప్రవర్తనను ఆయన అధికారమునకు ఒప్పుకోలేదు అని అర్థం.
ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి నీ జీవితం ఎలా వుంది? సంవత్సరంలు గడుచుచున్న కొలది నీ ఆత్మీయ జీవితం లో ఎదుగుదల కనిపిస్తుందా? దేవుని కార్యాలు ఏమన్నా చూడగలుగుతున్నావా? ప్రతి సంవత్సరం దేవుడు పెట్టే పరిక్షను ఎదుర్కొంటున్నావా? ఫైయిల్ అయ్యావు అంటే దేవుడు చెప్పే పాఠాలు సరిగ్గా నేర్చుకోవటం లేదు అని అర్థం, అనగా దేవుని వాక్యానుసారంగా జీవించటం లేదు.
అసలు పరిక్ష ఎదురు కాలేదు అంటే నువ్వే దేవునికి దూరంగా వున్నావు.... దుష్టుని చేతిలో వున్నావు జాగ్రత్త సుమా! వాడు నిన్ను ఎందుకు పనికిరానివానిగా చేసి నిత్య నరకానికి తీసుకువెళ్తాడు.
ఈ నూతన సంవత్సరం లో సరైన నిర్ణయం తీసుకో, ప్రతి దినము దేవుని సన్నిధికి వచ్చి వాక్యం ధ్యానించు. ప్రతి ఆదివారం దేవుని మందిరమునకు వెళ్లి సేవకులు చెప్పే వాక్యం మీద మనస్సు పెట్టు దేవుడు తప్పక మీకు పాఠాలు నెర్పిస్తాడు, సత్యాలు బయలు పరుస్తారు, పరిక్ష లో విజయం సాధించటానికి సహాయం చేస్తాడు.
దైవుని కృప మీకు తోడుగా వుండును గాక. ఆమేన్"
🛐ప్రార్థన:- ప్రభువా, ఈ నూతన సంవత్సరములో నా జీవితం నీ చిత్తానుసారంగా నడిపించుము. నా అడుగులను నీ మార్గములో స్థిరపరచుము. ఆమేన్.
💓 *హల్లెలూయ...*
*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*
*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
➖➖➖➖➖➖➖➖➖➖
🙏 *మా గురించి మీ అనుదిన ప్రార్ధనలో జ్ఞాపకము చేసుకుంటున్నారని విశ్వసిస్తున్నాము. అంతకుమించి మీనుండి ఏదియు మేము ఆశించటములేదు.*
👉 *మీకు పంపుతున్నా అను దిన ఆత్మీయ సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మాకు తెలపగలరు.*
👉 *అను దిన ఆత్మీయ సందేశాలు* ప్రతి రోజు కావలసిన వారు
*WhatsApp లో నుండి మాత్రమే సంప్రదించండి* - *9573770951*
GOD SERVANT
*దైవాశ్శీసులు!!!*
👉 మీ మిత్రులకు SHARE చేసి మీ వంతుగా దేవుని పని చేయండి.
#💖నా యేసయ్య ప్రేమ #teluguchristian #bible #christian #యేసయ్య @యేసుక్రీస్తు అందరికి ప్రభువు


![💖నా యేసయ్య ప్రేమ - యేసుక్రీస్తు అందరికీ ప్రభువు HAPB'AEu VEAR 00g యెహేోవరె; సయరవైణ్సైరైవైతరి eapear New జీరుగీచండి] 20261 నీశరిగేనేరేగడెొి హబక్కూకు 32- JANUARY 9573770951 ప్రార్థన అవసరతలకు దేవుని పనివాడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు HAPB'AEu VEAR 00g యెహేోవరె; సయరవైణ్సైరైవైతరి eapear New జీరుగీచండి] 20261 నీశరిగేనేరేగడెొి హబక్కూకు 32- JANUARY 9573770951 ప్రార్థన అవసరతలకు దేవుని పనివాడు - ShareChat 💖నా యేసయ్య ప్రేమ - యేసుక్రీస్తు అందరికీ ప్రభువు HAPB'AEu VEAR 00g యెహేోవరె; సయరవైణ్సైరైవైతరి eapear New జీరుగీచండి] 20261 నీశరిగేనేరేగడెొి హబక్కూకు 32- JANUARY 9573770951 ప్రార్థన అవసరతలకు దేవుని పనివాడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు HAPB'AEu VEAR 00g యెహేోవరె; సయరవైణ్సైరైవైతరి eapear New జీరుగీచండి] 20261 నీశరిగేనేరేగడెొి హబక్కూకు 32- JANUARY 9573770951 ప్రార్థన అవసరతలకు దేవుని పనివాడు - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_693302_2a3ff3cc_1767254690749_sc.jpg?tenant=sc&referrer=pwa-sharechat-service&f=749_sc.jpg)