#📰ఈరోజు అప్‌డేట్స్
పత్రికా ప్రకటన
శకటాల ప్రదర్శనలో ఆర్‌డబ్ల్యూఎస్ కి ప్రథమ స్థానం
సాంస్కృతిక ప్రదర్శనలో ఐటీడీఏ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు ప్రథమ బహుమతి
శ్రీకాకుళం, జనవరి 26:
ప్రభుత్వ శాఖల అభివృద్ధిని కళ్ళకు కట్టినట్లు వివరించిన శకటాల ప్రదర్శనలో గ్రామీణ నీటి సరఫరా విభాగం ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ అందుతున్న తాగునీటి సరఫరాను ప్రతిబింబించేలా ఈ శకటాన్ని తీర్చిదిద్దారు. వ్యవసాయ రంగ ప్రగతిని చాటిచెప్పిన వ్యవసాయ శాఖ శకటం ద్వితీయ స్థానంలో నిలవగా.. సంక్షేమ పథకాలు, ప్రజారోగ్య సేవలను ప్రతిబింబించిన విద్య, ఆరోగ్య శాఖలు సంయుక్తంగా తృతీయ స్థానాన్ని దక్కించుకున్నాయి.
సాంస్కృతిక పోటీల్లో గిరిపుత్రుల హవా..
విద్యార్థులు ప్రదర్శించిన ఆకట్టుకునే సాంస్కృతిక పోటీల్లో సీతంపేట ఐటీడీఏ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్థులు తమ అద్భుతమైన గిరిజన నృత్య ప్రదర్శనతో ప్రథమ బహుమతిని గెలుచుకున్నారు. దేశభక్తి గీతాలకు లయబద్ధంగా నాట్య ప్రదర్శన చేసిన న్యూ సెంట్రల్ పాఠశాల విద్యార్థులు ద్వితీయ బహుమతిని సాధించగా.. మన సంస్కృతిని చాటిచెప్పిన కేజీబీవీ లావేరు విద్యార్థులు తృతీయ బహుమతిని అందుకున్నారు.
#🥳హ్యాపీ రిపబ్లిక్ డే🇮🇳 #🎺రిపబ్లిక్ డే పరేడ్🇮🇳 #🇮🇳రిపబ్లిక్ డే స్టేటస్🎊 #📰జాతీయం/అంతర్జాతీయం


