మాట ఇచ్చినట్టే.. మన ఛాంపియన్ శ్రీచరణికి నారా లోకేష్ గారి చేతుల మీదగా ప్రోత్సాహకాలు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం, మహిళల వరల్డ్ కప్‌లో సత్తా చాటి, మన రాష్ట్ర కీర్తిని దశదిశలా చాటిన ఆంధ్రప్రదేశ్ ఆణిముత్యం శ్రీచరణికి నేడు ఉండవల్లి నివాసంలో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు ₹2.50 కోట్ల చెక్, కడపలో 500 చదరపు గజాల ఇంటి స్థలం, రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్–1 హోదాలో ఉద్యోగ ప్రోత్సాహాలను అందించారు.మట్టిలో పుట్టిన మాణిక్యాల ప్రతిభను వెలికితీసి, ప్రపంచస్థాయి వేదికల పై నిలబెట్టేందుకు మేమంతా నిరంతరం కృషి చేస్తూనే ఉంటాం. #🏏క్రికెట్ 🏏


