*రూతు 3:11 “నా కుమారీ, భయపడకుము; నీవు చెప్పినదంతయు నీకు చేసెదను…”* ఈ వాగ్దానం ఆధారం కోల్పోయి, ఒంటరిగా, నిరాధరమైన జీవితం గలవారికి ఇది ఒక భరోసా. రూతు తన భర్తను కోల్పోయిన వితంతువు. భవిష్యత్తు అంధకారంగా కనిపించిన ఆ క్షణంలో దేవుడు ఆమెను నిర్లక్ష్యం చేయలేదు. భయపడుతున్న హృదయాన్ని చూసి, “భయపడకుము” అని ముందుగా చెప్పాడు.
మన జీవితాల్లో ఏ ఆధారం లేనప్పుడు, మనతో ఉంటారని నమ్మినవారు దూరమైనప్పుడు. ఒంటరితనం మనల్ని బలహీనపరుస్తుంది. కానీ దేవుడు మన పరిస్థితిని మాత్రమే కాదు, మన కన్నీళ్లను కూడా గమనిస్తాడు. “నీవు చెప్పినదంతయు నీకు చేసెదను” అన్న మాటలో దేవుని బాధ్యత, కరుణ, నిబద్ధత స్పష్టంగా కనిపిస్తాయి. భయంతో వణికే హృదయాలకు ధైర్యం పోసి, నిలబెట్టే శక్తి ఆయన వాగ్దానాల్లోనే ఉంది. దేవుడు నిరాధారులకు ఆశ్రయం, ఒంటరితనంలో చేయి పట్టుకునేవాడు, జీవితాలను నిలువపెట్టేవాడు. కాబట్టి ఈ రోజు ఎవరికైనా జీవితం అర్థంలేనిదిగా అనిపిస్తే “భయపడకుము.” దేవుడు నిన్ను చూస్తున్నాడు, నిన్ను విలువైనవాడిగా భావిస్తున్నాడు, నీ జీవితాన్ని తిరిగి నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్ 🙏
http://youtube.com/post/UgkxJctM1FklxgISHUpc_omafKk1dZNCm5Kp?si=McwBb9reTTPPCXB3l #✝జీసస్ #🌅శుభోదయం #🙆 Feel Good Status #😇My Status #💪పాజిటీవ్ స్టోరీస్


