🌹🙏ఈ ఆదివారం రోజున సూర్య అనుగ్రహం కోసం సూర్య అష్టకం పఠన చేయండి....!!
1. ఆదిదేవ ! నమస్తుభ్యం – ప్రసీద మమ భాస్కర |
దివాకర ! నమస్తుభ్యం – ప్రభాకర నమోస్తుతే
అర్థము : ఆదిదేవుడైన సూర్యభగవానునికి నమస్కారము, ఉదయభనుడు నన్ను కరుణించుగాక. దినాధిపతికి నమస్కారం. ప్రకాశ స్వరూపునకు నమస్కారం.
2. సప్తాశ్వరథ మారూఢం – ప్రచండం కశ్యపాత్మజం |
శ్వేతపద్మధరం దేవం – తం సూర్యం ప్రణమామ్యహమ్
అర్థము : ఏడు గుఱ్ఱములు గల రథమునందు పయనించువాడు అద్భుతంగా ప్రకాశించువాడు, కశ్యపుని కుమారుడు తెల్లని పద్మమును ధరించినవాడగు సూర్యభగవానునకు ప్రణమిల్లుచున్నాను.
3. లోహితం రథమారూఢం – సర్వలోకపితామహం |
మహాపాపహరం దేవం – తం సూర్యం ప్రణమామ్యహమ్.
అర్థము : ఎ ఱ్ఱని రథముపై పయనించువాడు సర్వలోకములకు ప్రభువు సర్వపాపములను నశింపజేయునట్టి సూర్యభగవానునకు ప్రణమిల్లుచున్నాను.
4. త్రైగుణ్యం చ మహాశూరం – బ్రహ్మ విష్ణుమహేశ్వరమ్ |
మహాపాపహరం దేవం – తం సూర్యం ప్రణమామ్యహమ్
అర్థము : సత్వ, స్తమో, రజో గుణములు దాల్చినవాడు మహాశూరుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకుడు సర్వపాపములను నశింపజేయునట్టి సూర్యభగవానునకు ప్రణమిల్లుచున్నాను.
5. బ్రంహితం తేజసాంపుంజం – వాయు రాకాశ మేవ చ |
ప్రియంచ సర్వలోకానాం – తం సూర్యం ప్రణమామ్యహమ్.
అర్థము : దేదీప్యమానముగ ప్రకాశించువాడు, అంతట వ్యాపించినవాడు సర్వలోకములకు ప్రభువు సూర్యభగవానునకు ప్రణమిల్లుచున్నాను.
6. బంధూకపుష్పసంకాశం – హారకుండలభూషితం |
ఏకచక్ర దరం దేవం – తం సూర్యం ప్రణమామ్యహమ్.
అర్థము : బంధూక పుష్ప వర్ణము కలవాడు, మెడలో హారము, చెవి పోగులు ధరించినవాడు కాల చక్రమును చేత ధరించినవాడు సూర్యభగవానునకు ప్రణమిల్లుచున్నాను.
7. తం సూర్యం జగత్‌కర్తారం – మహాతేజ: ప్రదీపనమ్|
మహాపాపహరం దేవం- తం సూర్యం ప్రణమామ్యహమ్.
అర్థము : సర్వ లోకపాలకుడైన సూర్యభగ వానుడు సర్వలోక ప్రభువు, సర్వ పాపములను నశింపజేయునట్టి సూర్యభగవానునకు ప్రణమిల్లుచున్నాను.
8. తం సూర్యం జగతాం నాథం – జ్ఞానవి జ్ఞానమోక్షదమ్ |
మహాపాపహారం దేవం – తం సూర్యం ప్రణమామ్యహమ్.
అర్థము : లోక పరిపాలకుడు, జ్ఞానము, విజ్ఞానము, మోక్షము నొసగువాడు సర్వపాపములను నశింపజేయునట్టి సూర్యభగవానునకు ప్రణమిల్లుచున్నాను.
9. సూర్యాష్టకం పఠేన్నిత్యం – గ్రహపీడా ప్రణాశనం |
అపుత్రో లభతే పుత్రం – దరిద్రో ధనవా న్భవేత్ |
అర్థము : ఈ సూర్యాష్టకం ప్రతీదినం పఠించిన వారికి గ్రహపీడలు నశించును. పుత్రులు లేని వారికి పుత్రులు కల్గుదురు. దరిద్రలు ధనవంతులగుదురు...🚩🌞🙏🌹
. #🌅శుభోదయం #🌼ఆదివారం స్పెషల్ విషెస్ #🙏🏻ఆదివారం భక్తి స్పెషల్ #🌞శ్రీ సూర్యనారాయణ స్వామి🌞 #🌞 శ్రీ సూర్యనారాయణ స్వామి 🌞


