ShareChat
click to see wallet page
search
*యెషయా 54:10 పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు...* ప్రియమైన సహోదరులారా, మన జీవితాల్లో కొన్నిసార్లు పర్వతాల్లాంటి బలమైన ఆధారాలు కూలిపోతున్నట్టు అనిపిస్తుంది. నమ్ముకున్న సంబంధాలు దూరమవుతాయి, ఆశలు మెట్టలులా తత్తరిల్లినట్టు కనిపిస్తాయి. అప్పుడు మన గుండెల్లో భయం, అనిశ్చితి చోటుచేసుకుంటాయి. కానీ యెహోవా చెబుతున్నాడు. “పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు.” మన చుట్టూ ఉన్న ప్రతిదీ మారిపోయినా, దేవుని కృప మాత్రం మారదు. మన స్థితిపై కాదు, ఆయన స్వభావంపైనే ఆ కృప ఆధారపడింది. ఈ రోజు నీ పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్నట్టు కనిపించినా, దేవుని ప్రేమ నీ పక్షాన నిలిచివుంది. నీవు ఒంటరివాడివి కాను. ఆయన కృప నీకు కవచమై ఉంది, నీ భవిష్యత్తుకు భరోసాగా ఉంది. కాబట్టి భయపడకుము. గుండెల్లో నిబ్బరం పెట్టుకొనుము. ఈ క్షణికమైన కదలికలు నిన్ను కూల్చలేవు—ఎందుకంటే కదలనిది అయిన దేవుని కృప నిన్ను పట్టుకొని ఉంది. ఆ కృపలో నిలబడి, ధైర్యంగా ముందుకు సాగుము. ✨ http://youtube.com/post/Ugkx6oqUX_Shkf6Pk1UErwhU_RVIba9bXLwO?si=DeIyPZ1pIfvqRtCD #✝జీసస్ #🌅శుభోదయం #🙆 Feel Good Status #😇My Status #💪పాజిటీవ్ స్టోరీస్ *Plz Subscribe, Share, Like and Comment*
✝జీసస్ - 026 ನಐಿ ನಾಗ್ದಾನನಿ १६ Jan మెట్టలు తత్తరిల్లినను . కృష్ణనిన్ను. 0 విడిచిపోదు: = Yesoyyo somcononoms KingdomUdcg Pastor Mfuar ( 026 ನಐಿ ನಾಗ್ದಾನನಿ १६ Jan మెట్టలు తత్తరిల్లినను . కృష్ణనిన్ను. 0 విడిచిపోదు: = Yesoyyo somcononoms KingdomUdcg Pastor Mfuar ( - ShareChat