ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
నిరంతరం శ్రీ సాయి నామ స్మరణ - సర్వపాప హర సర్వ అవస్థ రక్షకరం
శ్రీ సాయినాథ అష్టోత్తర శతనామావళి
ఓం అసహయ సహాయాయ నమః
ఎవరూ లేని దీనులకోసం సాయి చాపును కరుణా హస్తం అన్నది సాయి అభయం .నీవే తప్ప
ఇతరపరం ఎరుగ "అని సాయినాధుని శరణు వేడినచో మరు క్షణంలో ఆయన సహాయము అందుతుంది
ఒకసారి ఒక వృద్దురాలు ఎంతోదూరంనుంచి బాబా దర్శనము చేయాలనుకుని వచ్చింది .
ద్వారకామాయి ద్వారము దగ్గరగల
జనసందోహము దాటి లొపలికి వెళ్లలేకపోయింది
చివరకి అలసిపోయి శక్తి లేక బయటనే నేలమీద
కూర్చొండిపోయింది .ఆమె బాబా కు నివేదించాలని కొన్ని రొట్టెలు కూడా తెచ్చింది .
నీరసంతో ఆకలి తట్టుకోలేక ,తెచ్చి న రొట్టెలలో
సగంపైగా తినేసింది .జరిగినదానికి చింతిస్తూ
బాధతో బాబాను చూడలేకపోతున్నందుకు చింతింస్తు వుండగా ,ఆ వృద్దురాలు మనసులో
ఆర్తితో పిలిచిన పిలుపు బాబాకు వినిపించిందేమో
బాబా అక్కడే ఉన్న శ్యామాను పిలచి నాకోసం
ఒక వృద్దురాలు వచ్చి మశీదు గడప ముందు
పడియున్నది .దారి లేక అల్లాడుతున్నది .వెళ్లి
తీసుకు రా ! అని చెప్పగా ఆ ముసలమ్మ బాబా వద్దకు వచ్చింది .
ఆమె రాగానే బాబా ఆమెను ఆప్యాతయతో పలకరించి ,నాకోసం ఏమి తెచ్చావమ్మా ? అని చెప్పి ,ఆమెవద్ద కల రొట్టెలను ఎంతో ప్రీతిగా తిన్నారు .అదీ బాబా భక్తుల ఎడల చూపే ప్రేమ హస్తం #🕉 ఓం సాయిరామ్😇 #🙏🏼షిరిడి సాయి బాబా


