ShareChat
click to see wallet page
search
#భోగ భాగ్యలిచ్చే భోగి #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #గోదాదేవి #గోదాదేవి (ఆండాళ్) తిరుప్పావై పాశురాలు (మంగళకరమైన మేలుకొలుపు) #ధనుర్మాసం విశిష్టత *గోదా భోగమే భోగి* గోదా అంటే వాక్కును, వస్త్రములను, అద్దమును, విసనకర్రను, ధనమును, జ్ఞానమును, సేవను ఇచ్చునది అని సంగ్రహంగా ఏడు అర్థాలు. మన వాక్కును, మనస్సును, శరీరాన్ని, బుద్ధిని, చిత్తాన్ని, ఒక్క మాటలో మన మొత్తాన్ని పరమాత్మకిచ్చు జీవాత్మే గోదా. దొరికిన రెండు పువ్వులు వేసి వచ్చిన నామాలు చెప్పి పరమాత్మకు మనల్ని మనం అర్పించుకోవాలి అనే మూడు ముక్కలను ముప్పై పాశురాలలో చెప్పి మూడు లోకాలను ముక్తి మార్గంలో నడిపించి మురిపించిన తల్లి గోదా. జీవాత్మ పరమాత్మను చేరుటయే గోదా కళ్యాణం. భోగి పండగ సందడి తెలుగు లోగిళ్లలో ప్రవేశించింది. ఈ పండగకు భోగి అనే పేరు ఎందుకు వచ్చిందనే సందేహం రావచ్చు. దీనికి రకరకాల కారణాలను తెలుపుతారు. వ్యవ సాయదారులు పంటలను ఇళ్లకు చేర్చుకుని విశ్రాంతితో భోగం అనుభవిస్తారు కనుక దీనికి భోగి అనే పేరు వచ్చిందని కొందరు చెబుతారు. అయితే విజ్ఞులు దీనికి మరో కారణాన్ని, అంతరార్థాన్ని, ప్రాశస్త్యాన్ని వివరిస్తున్నారు. గోదాదేవి నెల రోజులు వ్రతం చేసి రంగనాథుడిని వివాహ మాడి ఆ స్వామి చెంతకు చేరి భోగము అనుభవించిన రోజు భోగి అంటారు. నూటికి తొంభై మంది భోగి మంటలు చలి తీవ్ర తను తట్టుకోలేక వేసుకునేవి అనుకుంటారు. ఆ మంటలలో ఇంట్లోని పాత వస్తువులను ముఖ్యంగా కలపను వేయడం ఆచారం. అందులోని ఆంతర్యాన్ని నిశితంగా పరిశీలిస్తే అగ్ని అంటే జ్ఞానమని పండితుల నిర్వచనం. కలప అంటే అజ్ఞానం. అనగా జ్ఞానంలో అజ్ఞానాన్ని తగులబెట్టడం భోగి మంట. అజ్ఞానం, ఆరాటం, ఆశ, తుచ్చ అనుభవం, విపరీత ప్రవృత్తి, భ్రమ ఇవి మనలో ఉన్న కలపలు, వీటన్నింటిని జ్ఞానరూపమైన భగవంతునిలో దహింప చేయడమే భోగిమంట చెప్పే సందేశం. ప్రస్తుతం ఉన్న అజ్ఞానం తరువాత కలుగబోయే అజ్ఞానపు ఆలోచనలు అన్నీ కూడా దహింప చేయవలసినవే. ఇందులోని పరమార్థం స్వార్థాన్ని దహింప చేయడమే ఇతరుల ఇళ్ళల్లోని కలపను కూడా భోగి మంటల్లో వేసే ఆచారం ఉంది. అనగా వారికి ఇష్టం ఉన్నా లేకున్నా వారి అజ్ఞానాన్ని కూడా పోగొట్టే ప్రయత్నం చేయాలి, అప డు స్వార్థానికి తావుండదు. భోగి పండుగ రోజు ఐదు సంవత్సరాల లోప పిల్లలకు రేగి పళ్లు, చెరుకు గడలు, కొత్త పంటగా వచ్చిన బియ్యం, నాణేలు, బెల్లం ఇవ్వన్నీ కలిపి భోగి పళ్లుగా వారి శిరస్సున పోసే ఆచారం ఉంది. మన సంపదను పది మందికి పంచిపెట్టే దాత్రుత్వ బుద్ది పిల్లలకు అలవర్చాలని, ఉన్నది, తిన్నది మనది కాదని పది మందికి పంచినదే మనదనే ఉపనిషత్తు వాక్యసారం ఈ ఆచారంలో ఇమిడి ఉంది. ఇక గోదా కల్యాణంలోను అంతరార్థాలు దాగి ఉన్నాయి. ఇక గోదా దేవి విషయానికి వస్తే... శ్రీమన్నారాయణుడు సంసారంలోని జీవులను తరింప చేసే విధానాన్ని ఆలోచిస్తుండగా అమ్మ అతని అనుమతితో విష్ణుచిత్త పుత్రికగా పుట్టి యుక్త వయస్సు రాగానే పరమాత్మను మాత్రమే భర్తగా పొందగోరింది. ద్వాపర యుగంలో గోపికలు చేసిన మాస వ్రతాన్ని తాను ఆచరించి, పరమాత్మను ప్రసన్నుడిని చేసుకుని వివాహమాడింది. గోదా అంటే వాక్కును, వస్త్ర ములను, అద్దమును, విసనకర్రను, ధనమును, జ్ఞానమును, సేవను ఇచ్చునది అని సంగ్రహంగా ఏడు అర్థాలు. మన వాక్కును, మనస్సును, శరీరాన్ని, బుద్ధిని, చిత్తాన్ని, ఒక్క మాటలో మన మొత్తాన్ని పర మాత్మకిచ్చు జీవాత్మే గోదా. దొరికిన రెండు పువ్వులు వేసి వచ్చిన నామాలు చెప్పి పరమాత్మకు మనల్ని మనం అర్పిం చుకోవాలి అనే మూడు ముక్కలను ముప్పై పాశురాలలో చెప్పి మూడు లోకాలను ముక్తి మార్గంలో నడిపించి మురిపించిన తల్లి గోదా. జీవాత్మ పరమాత్మను చేరుటయే గోదా కళ్యాణం. తాను ఆచరించిన వ్రతం, తాను పొందిన ఫ లితం తనలోనే దాచుకొనక పది మందికి వ్రత విధానాన్ని బోధించడానికి తిరుప్పావై అను ముప్పె పాశురాల ప్రబంధాన్ని మృదుమధురంగా లోకానికి అందించింది. గోదాదేవి. ఆర్తి ఉన్నవారు అందరూ భగవంతుని పొందడానికి అర్హులే. కులం,మతం,జాతి వంటి భేదాలు భగ వంతుని పొందే విషయంలో లేవని విశ్వ మానవ కళ్యాణాన్ని వేనోళ్లచాటిన దయా మయురాలు గోదమ్మ. తాను ఒక్కతే కాక పది మంది గోపికలను లేపి వారితో కలిసి పరమాత్మ దగ్గరకు వెళ్లడం ద్వారా రుచి కరమైన పదార్థాన్ని ఒక్కరే భుజించక పది మందికి పంచాలనే ఉపదేశాన్ని తెలియ జేస్తుంది. భగవంతుని చేరాలంటే ఆహార నియ మం, వ్యవహార నియమం తప్పక పాటించాలని, మనం చేసుకునే అన్ని అలంకారాలు భగవంతుని కోసమే అని చెప్పడమే ఈ వ్రతోద్దేశ్యం. ఏ వ్రతమైనా నియమాలను ఆచరించడం తప్పనిసరి. శరీరాన్ని శోషింప చేస్తే మనసు పోషింపబడుతుంది, మనసు పోషించ బడితే స్వార్థం సమూ లంగా నశిస్తుంది. పరార్థం, పరమార్థం వికసిస్తాయి అనే ఉపదేశం గోదా కళ్యాణంలో ఇమిడి ఉంది.
భోగ భాగ్యలిచ్చే భోగి - లససగ లసిందం ٥ ٤٤ ٠ث RCO Daily Wish Telugu 9+91 9700 722 711 లససగ లసిందం ٥ ٤٤ ٠ث RCO Daily Wish Telugu 9+91 9700 722 711 - ShareChat