*నీవు బ్రతకాలంటే..!!*
*ఈ రోజుల్లో చాలామంది సేవకులు కావొచ్చు, విశ్వాసులు కావొచ్చు, క్రైస్తవుడినని చెప్పుకుంటున్న ఎవరైనా కావొచ్చు... అలాంటి వారు చేసే ఘోరమైన పాపిష్టి పనియేమిటో తెలుసా? బైబిల్‌ను ఇంట్లో పెట్టుకుంటారు, చంకలో పెట్టుకుని తిరుగుతారు కానీ ఆ బైబిల్‌ను తెరిచి చదవడానికి ఇష్టపడరు. ఎప్పుడో గుర్తుకు వచ్చినప్పుడు, ఏదో బాధ కలిగినప్పుడు మాత్రమే అలా చదివి, ఇలా వదిలేస్తారు. అంటే వారి ఇష్టం వచ్చినప్పుడు ఏదో చదవాలి కదా? అని అలా చదువుతారు. మరీ ఇలాంటి వారు సేవకులేనా? విశ్వాసులేనా? క్రైస్తవుడేనా? ఇలాంటి వారిని ఏమానాలి? సైతాను బిడ్డలని అనడం ఏమాత్రం తప్పులేదు. మరీ దేవుని బిడ్డలని చెప్పుకోవడానికి ఏం చేయాలని ఆలోచలోపడ్డారా? అయితే విను!!*
*బైబిల్‌లోని ద్వితీయోపదేశకాండములో స్పష్టంగా లిఖించబడి ఉంది, ''నీవు ఊపిరితో ఈ భూమిపై ఉన్నంతవరకు బైబిల్ (పరిశుద్ధగ్రంథము)ను చదవాలి'' ప్రతిరోజు క్రమం తప్పకుండా బైబిల్‌ను చదవాలి, ఆ విధంగా బైబిల్ చదివేవారు మాత్రమే దేవుని బిడ్డలని అనుటకు, దేవుని బిడ్డలని పిలిపించుకోవడానికి అర్హులు. మరీ ఈ రోజు దేవుడు నిన్ను ఊపిరితో బ్రతుకునిచ్చాడు కదా? అయితే ఈ రోజు బైబిల్‌లోని ఎన్ని ఆధ్యాయాలు ధ్యానించావు? దేవుడు నీ జీవితంలో మంచి కార్యాలు చేయాలంటే.. ప్రతిరోజు మనస్ఫూర్తిగా బైబిల్‌ను ధ్యానించాల్సిందే.*
*ప్రతిరోజు క్రమంగా బైబిల్‌ను చదవకుండా.. నీవు ప్రతి ఆదివారం మందిరానికి వెళ్లినంతమాత్రానా, ఇంటింటికి తిరిగి సువార్త చెప్పినంత మాత్రానా, పేదవారికి నీవు ఎంత డబ్బు సహాయం చేసినంత మాత్రానా, దినమంతా మందిరంలో నివసించినంత మాత్రానా, దినంలో ఎక్కువగా దేవుని పాటలు పాడినంత మాత్రానా, ఎక్కువ సమయం ప్రార్థించినంత మాత్రానా, అలాగే ప్రతిదినం క్రమం తప్పకుండా బైబిల్ చదవకుండా సేవకుడినని చెప్పుకుంటూ.. ఇంటింటికి తిరిగినంత మాత్రానా, అదే రీతిగా స్టేజీలపై ప్రసంగాలపై ప్రసంగాలు దంచికొట్టినంత మాత్రానా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడు. ఏంటి బ్రదర్? మీరు ఇంత కచ్చితంగా ఎలా చెప్పగల్గుతున్నారని నన్ను ప్రశ్నిస్తున్నారా? అయితే విను..*
*''నీవు బ్రదుకు దినములన్నియు పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలనేది దేవుని యొక్క ఆజ్ఞ కదా? మరి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం పాపమే కదా? అంటే ప్రతిరోజూ నిన్ను బ్రతికిస్తున్న దేవుడు చెప్పిన పని చేయకపోవడం తప్పే కాదా? పరిశుద్ధ గ్రంథాన్ని చదవమని చెప్పిన దేవుని యొక్క ఆజ్ఞను పక్కనపెడుతూ... నీవు ఎన్ని మంచి పనులు చేసినా ఏం ప్రయోజనం? ఫలితం శూన్యమే కదా? అందుకే నా రెండు చేతులు జోడించి కన్నీటితో చెబుతున్నాను..*
*ప్రియ సహోదరి, సహోదరుడా!! ప్రతిదినం వేకూజామునే నిద్ర లేవడం అలవాటు చేసుకోండి. అంటే కనీసం ఉదయం 5 గంటలకు నిద్రలేచి 2 అధ్యాయాలు బైబిల్ చదవండి, 20 లేదా 30 నిమిషాలు ప్రార్థన చేయండి, అలాగే రాత్రి నిద్రించే ముందు రెండు అధ్యాయాలు బైబిల్ చదవండి, 20 లేక 30 నిమిషాలు ప్రార్థించండి. ప్రతిదినం ఇలా చేయడం వలన దేవునిపై, ఆయన వాక్యంపై, ప్రార్థనపై నీకు శ్రద్ధ పెరుగుతుంది. తద్వారా నెలలు గడిచిపోయేకొలది నీవు మరింత ఎక్కువగా బైబిల్ చదవడానికి, ఎక్కువసేపు ప్రార్థించడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు నీవు ఎటువంటి భయంకరమైన సమస్యకైనను భయపడవు, ధైర్యంగా విశ్వాసంతో దేవునిపై ఆధారపడి బ్రతికే మనసును కల్గివుంటావు. ఈ విధానాన్ని.. ఇది చదువుతున్న నీవు ప్రతిదినం క్రియల్లో పెడుతూ.. దేవుడు చేసే మహా గొప్ప అద్భుతకార్యాలను కళ్లారా చూడాలని నా మనవి. ''నీవు బ్రదుకు దినములన్నిటను ఆ గ్రంథమును (బైబిల్) చదువుచుండవలెను.'' (ద్వితీ 17: 20)*
******************************************
*ప్రతిదినం పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నారా? అయితే మీ కోసమే ఈ గ్రూప్స్...!*
*WhatsApp Community - 1 link:*
https://chat.whatsapp.com/BKEcChdxaKrK0dJ8CqADcD
***************************************
*Telegram group Link*
https://t.me/+XtII92fKOXAyNWQ9
********************************
*యూట్యూబ్ ఛానల్ లింకు*
https://www.youtube.com/@calvarykiranalu-l7t
********************************
*మీ ప్రార్దన అవసరతను నా నెంబర్ కు మెసేజ్ చేయండి.... మీ ప్రార్దన మనవిని మన అన్నీ గ్రూప్స్ లో నేనే పోస్ట్ చేయడం జరుగుతుంది. మీ సమస్యపై మన గ్రూప్స్ సభ్యులందరూ ప్రార్దన చేస్తారు. మనకు కావల్చింది వాక్యం, ప్రార్దన.*
*- మీ సహోదరుడు మోషే*
*- (Calvary Kiranalu )*
*-(📲 9550576444)*
************************************
#jesu #యేసు ప్రభువు #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #JESU I LOVE YOU JESUS #✝️Jesu✝️ #Jesus


