శ్రీ సాయి పలు సంధర్భాలలో తన భక్తులను అద్భుతమైన బోధలను చేసేవారు.
అటువంటి దివ్య, మధుర సందేశాలలో ఒకటి
ఎవరైతే నన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారో, నన్నే నిరంతరం గుర్తంచుకూంటూ నన్ను ఆరాధిస్తారో వారు నాకెంతో ఆప్తులు. వారిని రక్షించేందుకు నేను సప్త సముద్రాలనైనా దాటుకుంటూ వెళతాను.
నాకు భక్తుల నుండి ఆడంబరమైన పూజలు, శాస్త్రోక్తమైన ఆగమ శాస్త్ర విధానంతో అర్చనలు అవసరం లేదు. నాకు కావలసింది భక్తుల ప్రేమానురాగాలు మాత్రమే.
నేను లేక వారికి ఈ జగత్తు అంతా శూన్యం గా భావించేవారు ధన్యులు. వారికి నా అనుగ్రహ, కరుణా కటాక్షాలు అన్నివేళలా లభిస్తాయి.
నా కధలనే చదువుతూ, నా నామాన్నే స్మరిస్తూ, నా రూపాన్ని తమ మనస్సులో నింపుకొని ఎల్లవేళలా ధ్యానం చేస్తూ, నాకు తమ తన, మన, ప్రాణములను అర్పించి సర్వశ్య శరణాగతి చెస్తే వారిని నేను ఋణస్తుడనై వుంటాను.
ఆ భక్తజన మహాశయులకు మోక్షం ఇచ్చి వారి ఋణం తీర్చుకుంటాను. ఎవరైతే సర్వదా నన్నే చింతిస్తూ , నా గురించే దీక్షతో వుంటూ, నాకు అర్పించకుండా ఏమీ తినరో అట్టి వారిపై నేను ఆధారపడి వుంటాను.*
ఎవరైతే భక్తి శ్రద్ధలతో, పూర్ణ విశ్వాసం తో నా సన్నిధానానికి వస్తారో, అట్టి వారు నదులనీ సముద్రంలో కలిసిపోయినట్లు నాలో ఐక్యం చెందుతారు.
నిర్మల హృదయంతో, పరిపూర్ణ భక్తి శ్రద్ధలతో, నిండైనా విశ్వాసంతో , గర్వాహంకారాలు లవలేశమైనా లేక తమ హృదయాలలో కొలువై వున్న నన్ను శరణు వేడి, సర్వశ్య శరణాగతి చేస్తారో అట్టివారికి ఆద్యాత్మిక ప్రగతి శ్రీఘ్రంగా సాగుతుంది.
అన్ని జీవుల హృదయాలలో కొలువై వున్న నన్ను దర్శించండి. సర్వ జీవ సమానత్వం, సర్వ మానవ సౌభ్రాతృత్వం భావనతో జీవించండి. #🕉 ఓం సాయిరామ్😇 #🙏🏼షిరిడి సాయి బాబా #🌅శుభోదయం #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🎶భక్తి పాటలు🔱


