*🛐 ప్రార్ధన 🛐*
యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము.
హబక్కూకు 3:2.
🙇♂️🙇♂️🙇♂️... ప్రేమామయుడా ప్రేమస్వరూపి ప్రేమగల దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాము తండ్రి. గడిచిన సంవత్సరమంతయు మమ్ములను నీ కృపాక్షేమములతో రక్షించి కాపాడి నడిపించిన దేవా, మరియొక నూతన సంవత్సరంలోకి నడిపించినవాడ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభువా ఈ దినము నీ బిడ్డలమైన మమ్ములను జ్ఞాపకం చేసుకొని దర్శించండి, మాలోని కల్మషమును వ్యర్ధమైన ప్రతి ఆలోచనను చెడు స్వభావంను తొలగించి ఈ నూతన సంవత్సరంలో నూతన హృదయమును స్వభావమును బుద్ధిని మనస్సును మాకు అనుగ్రహించుము యేసయ్య. మీ పరలోక జ్ఞానంతో నింపుము దేవా. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు మాయెడల నూతన పరచుము తండ్రి. నూతన ఆశీర్వాదములు మాపై మా కుటుంబముపై ఉంచుము దేవా. "నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును" అన్న వాగ్దానము మా జీవితాలలో జరిగించండి యేసయ్య. ఈ సమయములో ప్రతి ఒక్కరినీ వారి కుటుంబాలను పేరు పేరున దర్శించి వారి మనస్సును తెలుసుకొనుము దేవా. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి కోరికను వారి జీవితాలలో నెరవేర్చి వారి యొక్క ఆలోచనలను సఫలపరచుము యేసయ్య. నూతన జీవితంను గడుపుటకు సహాయం చేయండి. ప్రతిదినము నిన్ను వెతికే వారికి నీవు ప్రత్యక్షమగు దేవా, నీవే రక్షకుడవు దేవుడవు అని వారు ఎరుగుటకు మనోనేత్రములను వెలిగించి వెలుగులోనికి నడిపించండి యేసయ్య. నూతన సంవత్సరంలో నూతన కార్యములు అందరియెడల జరిగించండి. నీ అమూల్యమైన రక్తము ప్రతి బిడ్డపై ప్రోక్షించి పవిత్రపరచుము. ప్రతి దినము మేము నీ వాక్యము ద్యానిస్తూ మా జీవితాలను ప్రార్ధనతో కట్టుకొనుటకు సహాయం చేయండి తండ్రి. ప్రతి కుటుంబములో నెమ్మదిని శాంతిని సమాధానము అనుగ్రహించండి. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న విశ్వాసంతో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్ధించి పొందుకున్నాము పరమతండ్రి ఆమేన్.
*🤝🏻 దేవుని పనివాడు 🛐*
ప్రార్ధన ఫొటోస్ కొరకు వాట్సప్ లో మెసేజ్ చేయండి 9573770951. #christian #bible #prayer #Happynewyear 😃🎉🎊


