ShareChat
click to see wallet page
search
#🙏శివపార్వతులు *తండ్రి పరమేశ్వర ! అశాంతితో ఉన్న నా మనస్సుకు ప్రశాంతత ఇచ్చేది నీ నామము అని తెలిసి కూడా నీ స్మరణ చేయలేకపోతున్నాను.* తండ్రి ఉమామహేశ్వర ! కష్టాన్ని కూడా ఇష్టంగా భరించేలా చేసేది నీ సాన్నిధ్యము అని తెలిసి కూడా నీ దగ్గరకు రాలేకపోతున్నాను. తండ్రి గౌరీశంకర ! భవిష్యత్తు గురించి భయాన్ని పోగొట్టే నీవు అండగా ఉన్నావన్న ధైర్యము ఉన్న నిబ్బరంగా నిలబడలేకపోతున్నాను. తండ్రి కేదారేశ్వర ! గతాన్ని గురించి చింతను పోగొట్టేది నీ ఆదేశమే అన్న నమ్మకము ఉన్న, ఎందుకో అపనమ్మకంతో ఉండిపోయాను. తండ్రి బోలాశంకర ! ప్రస్తుతం వర్తమానంలో సంతోషంగా స్వీకరించడానికి ఉన్నది నీ అనుగ్రహమే అని గ్రహించిన, నిగ్రహంగా రెండు చేతులెత్తి నీకు నమస్కారించలేకున్నాను. తండ్రి చంద్రమౌళేశ్వర ! నాపై దయ చూపి, నాలో ఉన్న ఈ దుఃఖపు మూటను శీఘ్రముగా స్వీకరించి, అడ్డుగా నిలిచిన ఈ మాయ పొరను తొలగించి జ్ఞానమనే వెలుగు దీపాన్ని వెలిగించమని ప్రాధేయపడుతున్నాను. *నమో హార పార్వతి పతియే హర హర మహాదేవ శంభో శంకర, మీ పాదపద్మములే నాకు ఎల్లవేళలా శరణాగతి, ఓం నమఃశివాయ.🙏🪷* #🙏🏻సోమవారం భక్తి స్పెషల్ #🌅శుభోదయం #🙏🔱కాశీ విశ్వనాథ్‌ ధామ్🛕 #🌻సోమవారం స్పెషల్ విషెస్
🙏శివపార్వతులు - ShareChat