ShareChat
click to see wallet page
search
నమ్మిన వారిని నట్టేటముంచేవాడు కాదు ఈసాయి అని సాయి తరచుగా తన భక్తులతో అంటుండేవారు. తనను పరిపూర్ణ విశ్వాసంతో త్రికరణ శుద్ధిగా నమ్మి కొలిచిన వారిని సప్తసముద్రాల ఆవల వున్నా రక్షించే వారు శ్రీసాయి. అందుకే ఆయన సద్గురు శ్రేష్టుడు. భక్తుల పాలిటి ఆశ్రిత కల్పవృక్షం. ఒకరోజు మధ్యాహ్నం శ్రీ సాయి మశీదులో కూర్చోని భక్తులతో సద్గోష్టి చేస్తున్నారు. ఇంతలో “అబ్బా!” అని పెద్దగా కేక పెట్టారు. వెంటనే ఆయన దుస్తులన్నీ తడిసి పోయి నీరు ధారపాతంగా కారడం ప్రారంభించింది. ఇది చూస్తున్న భక్తులు ఆశ్చర్యపోయారు. అప్పుడు వర్షం కూడా లేదు, సాయి ఆ విధంగా ఎలా తడిసిపోయారో ఎవరికీ అర్ధం కాలేదు. కొద్ది సేపటికి తర్వాత శ్రీసాయి సంతృప్తిగా “హమ్మయ్య, భావూకు ఇక ఏ ప్రమాదం లేదు” అని అన్నారు. రెండు రోజుల తర్వాత తన ప్రార్ధనను విని తనను ప్రాణాలతో రక్షించి నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ టెలిగ్రాం పంపాడు జహంగిర్ అనే భక్తుడు. అప్పుడు అసలు సంగతి శ్రీ సాయి భక్తులకు చెప్పారు. రష్యా – జపాన్ యుద్ధంలో అతను ఒక యుద్ధ నౌకకు కెప్టెన్. యుద్ధంలో పాల్గొన్న మూడు నౌకలను శత్రువులు ముంచివేసారు. అతని నౌకపై కూడా శత్రువులు దాడి చేసారు. ఏ క్షణంలోనైనా ఆ నౌక కుడా మునిగి పోయేలా వుంది. నౌకాశ్రయం నుండి ఏ విధమైన సహాయం అందడం లేదు. అప్పుడు సాయి భక్తుడైన జహంగిర్ తన కేబిన్ లో తన నౌకను కాపాడమని కన్నీరు మున్నీరుగా ప్రార్ధించాడు. కరుణా సముద్రుడు, దయాళువు అయిన శ్రీ సాయి ఒక అద్భుత మైన లీలను ప్రదర్శించి అసామాన్యమైన రీతిలో ఆ నౌకను మునిగి పోకుండా కాపాడారు. ఆ నౌక కొద్ది రోజుల తర్వాత సురక్షితంగా పోర్టుకు చేరింది. తనతో పాటు వందలాది మంది ప్రాణాలను నడిసముద్రంలో కాపాడిన సమర్ధ సద్గురువు శ్రీసాయినాధులకు టెలిగ్రాం ద్వారా తమ కృతజ్ఞతలను తెలియజేసుకున్నాడు జహంగిర్. ఆర్తితో ప్రార్ధిస్తే తక్షణమే రక్షించి కాపాడే దయా సముద్రుడైన శ్రీ సాయినాధులు తన సమాధి అనంతరం నడి సముద్రంలో చేసిన మరొక అద్భుత, అపూర్వ, అసామాన్యమైన లీలను ఇప్పుడు స్మరించుకుందాం. ! 1972 వ సంవత్సరంలో మిత్రుల ప్రోద్భలంతో శిరిడీ వెళ్ళి సాయిని ప్రార్ధించాడు ప్యారేకిషన్. ఆ తర్వాత అతనికి ఎన్నో ఉద్యోగాలు వచ్చాయి. ఎందులో చేరాలో తేల్చుకోలేక సతమతమయ్యి సాయిబాబా చిత్రపటం ముందు చీట్లు వేయగా ఎం.వి. ధనలక్ష్మి అనే నౌకకు కెప్టెన్ గా చేరమని సందేశం వచ్చింది. ఆ ప్రకారంగానే ఆ ఉద్యోగంలో చేరిన ప్యారే కిషన్ నిత్యం తన నౌకను కాపాడుతుండమని బాబాను ప్రార్ధిస్తుండేవాడు. ఒకసారి ఆ నౌక కలకత్తా నుండి అండమాన్ కు బయలుదేరింది. నడి సముద్రంలో పెద్దతుఫాన్ సంభవించి నౌక నీటిలోనికి ఒరగనారంభించిం ది. ఇంజన్లు పని చెయ్యడం మానేసాయి. ఇంజనీర్లు ఎంత ప్రయత్నించినా రిపేరు చెయ్య లేకపోయారు. నౌకాశ్రయం నుండి ఎంత యత్నించినా సహాయం అందలేదు. ఇక తమ ప్రాణాలను రక్షించుకోవాలని అందరూ లైఫ్ బోట్లను తీసుకొని నీటిలోనికి దూకేసారు. ప్యారే కిషన్ లైఫ్ బోటును కూడా తీసుకోలేక తన సద్గురువును తనను కాపాడమని ఎంతో ఆర్తితో ప్రార్ధించి సముద్రంలోనికి దూకేసాడు. తిండి, నీరు లేక తీవ్రమైన అలలపై భయంకరం గా కురుస్తున్న వర్షంలొ ముప్పైగంటల పాటు కొట్టుమిట్టాడాడు. అందరికీ మరణం తప్పదనిపించింది. ఇంతలో ఒక దుంగ ప్యారే కిషన్ కు దొరికింది. దానిపైచేరి వెంటనే మూర్చ పోయాడు. మరి కొందరు కూడా దానిపై చేరారు. పదిపన్నెండు గంటలపాటు దానిపై స్పృహ తప్పి పడివుండగా ఆపద్భాంధవుడిలా జల కేంద్ర అనే మరొక నౌక అటువైపుగా వచ్చి అందరినీ రక్షించింది. ప్యారే కిషన్ ను తాళ్ళతో పైకి లాగుతున్నప్పుడు అతను మూడుసార్లు ముప్ఫైఅడుగుల వరకు వచ్చి తిరిగి సముద్రం లో పడిపోయాడు. కాని స్పృహలో వున్నంత వరకు సాయి నామస్మరణ చేస్తునే వున్నాడు. తన సద్గురువు తనను తప్పక కాపాడుతా డన్న ధృఢమైన విశ్వాసం అతనిలో వుంది. ఆఖరుగా అతనిని నౌకలోనికి లాగి అత్యవసర వైద్యమందించారు. త్వరలోనే అతను కోలు కొని సకుటుంబ సపరివారసమేతంగా శిరిడీ వెళ్ళి సాయి నాధుని దర్శనం చేసుకొని నడి సముద్రంలో తనకు ప్రాణదానం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసు కున్నాడు. భక్తి శ్రద్ధలు, విశ్వాసం వుంటే శ్రీ సాయి ఎటువంటి తీవ్రమైన ప్రతికూల పరిస్థితులలో వున్నా తన భక్తులను రక్షిస్తారని పై లీలలు మరొక్కసారి రుజువు చేస్తున్నాయి. #🕉 ఓం సాయిరామ్😇 #🙏🏼షిరిడి సాయి బాబా #🌅శుభోదయం #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🎶భక్తి పాటలు🔱
🕉 ఓం సాయిరామ్😇 - ShareChat