ShareChat
click to see wallet page
search
#💮వసంత పంచమి శుభాకాంక్షలు✨ 𝓝𝓪𝓶𝓪𝓵𝓪𝓗𝓪𝓻𝓲𝓴𝓻𝓲𝓼𝓱𝓷𝓪 *_𝕝𝕝ॐ𝕝𝕝 23/01/2026 - మాఘ శుద్ధ పంచమీ - శ్రీ పంచమీ / లలితా పంచమీ / మదన పంచమీ / వసన్త పంచమీ 𝕝𝕝卐𝕝𝕝_* *≈≈≈❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀≈≈≈* వసంత పంచమి / శ్రీ పంచమి అంటే ఏమిటో తెల్సుకుందాం. వసంత పంచమి పర్వదినం మాఘ శుద్ధ పంచమి రోజున వస్తుంది. శ్రీ పంచమి అని కూడా దీన్ని అంటారు. ఈ పర్వదినాన్ని ఉత్తర భారతదేశంలో విశేషంగా జరుపుకుంటారు. వసంత పంచమి రోజున లక్ష్మీదేవిని పూజచేస్తే సర్వ శుభాలు కలుగుతాయి. రతీ మన్మథులను పూజించి మహోత్సవం నిర్వహించాలని, దానం చేయాలని, దీని వల్ల మాధవుడు (వసంతుడు) సంతోషిస్తాడని నిర్ణయామృతకారుడు తెలిపాడు. అందువల్ల దీనిని వసంతోత్సవం అని కూడా అంటారు. 'మాఘ శుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభం అవుతుంది. ఆ రోజున విష్ణువును పూజించాలి. చైత్ర శుద్ధ పంచమి రోజు మాదిరిగానే బ్రాహ్మణులకు సంతర్పణ చేయాలి' అని వ్రత చూడామణిలో ఉంది. వసంత ఋతువు రాకను భారతదేశమంతటా వసంతపంచమి పండుగగా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పండుగ మాఘ శుక్ల పంచమినాడు (జనవరి-ఫిబ్రవరి) వస్తుంది. తూర్పు భారతదేశంలో దీనిని సరస్వతీ పూజగా జరుపుకుంటారు. జ్ఞానానికి అధిదేవత సరస్వతి. ఆమె జ్ఞానస్వరూపిణి. శాస్త్రం, కళలు, విజ్ఞానం, హస్తకళలు మొదలైన వాటిని చదువులతల్లి సరస్వతి అంశాలుగా మన పెద్దలు భావించారు. సృజనాత్మక శక్తికీ, స్ఫూర్తికీ కూడా వీణాపాణి అయిన సరస్వతిని సంకేతంగా చెప్పడం మన సంప్రదాయం. సరస్వతీం శుక్లవర్ణాం సుస్మితాం సుమనోహరామ్‌ కోటిచంద్ర ప్రభా ముష్ట పుష్ట శ్రీయుక్త విగ్రహమ్‌ వహ్ని శుధ్ధాంశుకాధానం వీణా పుస్తక ధారిణీమ్‌ రత్న సారేంద్ర నిర్మాణ నవ భూషణ భూషితామ్‌ జ్ఞానశక్తికి అధిష్టాన దేవత- సరస్వతీమాత. జ్ఞాన, వివేక, దూరదర్శిత్వ, బుద్ధిమత్తత, విచార శీలం తదితరాలను శ్రీవాణి అనుగ్రహిస్తుందంటారు. సత్వ రజస్తమో గుణాలను బట్టి అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన జగన్మాతను మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా కీర్తిస్తారు. ఈ ముగ్గురిలో సరస్వతీదేవి పరమ సాత్వికమూర్తి. అహింసాదేవి. ఆమెకు యుద్ధంచేసే ఆయుధాలు ఏమీ ఉండవు. బ్రహ్మ వైవర్త పురాణం సరస్వతీదేవిని అహింసకు అధినాయికగా పేర్కొంటోంది. ధవళమూర్తిగా పద్మంపై ఆసీనురాలై ఉన్న వాగ్దేవి మందస్మిత వదనంతో కాంతులీనుతూ ఆశ్రిత వరదాయినిగా దర్శనమిస్తుంది. మాఘశుద్ధ పంచమిని శ్రీ పంచమిగా, మదన పంచమిగా, వసంత పంచమిగా, సరస్వతీ జయంతిగా జరుపుకొంటారు. వసంత పంచమి నామాన్ని బట్టి దీన్ని ఋతు సంబంధమైన పర్వదినంగా భావించాలి. మకర సంక్రమణం తరవాత, క్రమక్రమంగా వసంత ఋతువు లక్షణాలు ప్రకృతిలో కనిపిస్తాయి. మాఘమాసం వసంత ఋతువుకు స్వాగత గీతం ఆలపిస్తుంది. ఆ వసంత ఋతువు శోభకు 'వసంత పంచమి' వేడుక శ్రీకారం చుడుతుంది. సరస్వతి శబ్దానికి ప్రవాహం అనే అర్థం కూడా ఉంది. ప్రవాహం చైతన్యానికి ప్రతీక. జలం జీవశక్తికి సంకేతం. నీరు సకల జీవరాశికి శక్తిని అందిస్తుంది. ఉత్పాదకతను పెంపొందిస్తుంది. ఈ ఉత్పాదకత వసంత ఋతువు నుంచి ఆరంభమవుతుంది. ఆ ఉత్పాదకశక్తికి ప్రతిఫలమే సరస్వతి. ఉత్పాదకుడైన, సృష్టికర్త అయిన బ్రహ్మకు శారదామాతే శక్తిదాయిని.ఉత్పాదకతను పెంపొందిస్తుంది. ఈ ఉత్పాదకత వసంత ఋతువు నుంచి ఆరంభమవుతుంది. ఆ ఉత్పాదకశక్తికి ప్రతిఫలమే సరస్వతి. ఉత్పాదకుడైన, సృష్టికర్త అయిన బ్రహ్మకు శారదామాతే శక్తిదాయిని. కాబట్టి వసంత పంచమి వసంతానికి ఆరంభ సూచకమైతే, ఈ రోజున సరస్వతీ పూజను నిర్వహించుకోవడం సహేతుకం. శ్రీ అంటే సంపద. జ్ఞాన సంపత్ప్రద అయిన సరస్వతిని ఈ రోజున పూజించడం విశేష ఫలప్రదమని చెబుతారు. అందుకే ఈ పర్వదినానికి శ్రీ పంచమి అని కూడా పేరు. శ్రీ పంచమినే రతి కామ దమనోత్సవంగా వ్యవహరిస్తారు. మాఘ శుక్ల పంచమినాడు రతీదేవి కామదేవ పూజ చేసినట్లు పౌరాణికులు చెబుతారు. ఋతురాజు అయిన వసంతానికి కామదేవునికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. వసంతుడు సస్యదేవత, కాముడు ప్రేమదేవత, రతీదేవి అనురాగదేవత. ఈ ముగ్గురినీ వసంత పంచమినాడు పూజించడం వల్ల వ్యక్తుల్లో పరస్పర ప్రేమానురాగాలు పరఢవిల్లుతాయని లోకోక్తి. ఇలాంటి ఎన్నో ఆంతర్యాల సమ్మేళనం- వసంత పంచమి పర్వదినం. 🚩 *_శుభమస్తు_* 🚩 *_𝕝𝕝ॐ𝕝𝕝 oఓo శ్రీమాత్రే నమః 𝕝𝕝卐𝕝𝕝_* *_𝕝𝕝 లోకాస్సమస్తాః సుఖినో భవన్తు 𝕝𝕝_*
💮వసంత పంచమి శుభాకాంక్షలు✨ - 30 మాఘశుద్ధ పంచమి: సరస్వతీ జయంతి  శ్రీపంచమి విశిష్టత . ప్రదాయిని; వాగ్గేవి సరస్వతీ మాత ఆరాధన . జ్ఞాన ஜஜ5 30 వాహన సంకేతాలు . ఆవిర్భావం & తత్వం పరమపురుషుని నుండి . ನಾಂನ: ನಿವಕ್ಷಣ; ವಾಣಕತ್ತಿ , శబ్దశక్తి  ওঃ০g৯০ వాక్; బుద్ధి; జ్ఞానముల ಯಜ್ಞಕತ್ತಿ  ನೆಮಲಿ: స్వరూపం . వేదరూపం సర్వ చైతన్య స్వరూపిణి . 39 త్రిశక్తి స్వరూపిణి . ఆరాధన నియమాలు . ప్రాతఃకాలంలో గాయత్రి . సాత్విక ప్రవృత్తి; శ్రద్ధ; భక్తి (ವಾಣಕಕ್ತಿ)" సత్యం; శౌచం అహింస మధ్యాహ్న కాలంలో . పాటించదం సావిత్రి (సృష్టిశక్తి) ವಾಜ್ಞಯ ಅಎನ್ಸು (@ಯ;' సాయంసంధ్యాకాలంలో . హిత; సత్య సంభాషణ)  ನರನ್ಪಲಿ (ಜ್ಞಾನಕಕ್ತಿ) ` @8860 సర్వ చైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ 30 ప్రచోదయాత్ ಭಿಮಹಿಾ ಬುದ್ಧಂ ಯಾ ನಃ 30 మాఘశుద్ధ పంచమి: సరస్వతీ జయంతి  శ్రీపంచమి విశిష్టత . ప్రదాయిని; వాగ్గేవి సరస్వతీ మాత ఆరాధన . జ్ఞాన ஜஜ5 30 వాహన సంకేతాలు . ఆవిర్భావం & తత్వం పరమపురుషుని నుండి . ನಾಂನ: ನಿವಕ್ಷಣ; ವಾಣಕತ್ತಿ , శబ్దశక్తి  ওঃ০g৯০ వాక్; బుద్ధి; జ్ఞానముల ಯಜ್ಞಕತ್ತಿ  ನೆಮಲಿ: స్వరూపం . వేదరూపం సర్వ చైతన్య స్వరూపిణి . 39 త్రిశక్తి స్వరూపిణి . ఆరాధన నియమాలు . ప్రాతఃకాలంలో గాయత్రి . సాత్విక ప్రవృత్తి; శ్రద్ధ; భక్తి (ವಾಣಕಕ್ತಿ)" సత్యం; శౌచం అహింస మధ్యాహ్న కాలంలో . పాటించదం సావిత్రి (సృష్టిశక్తి) ವಾಜ್ಞಯ ಅಎನ್ಸು (@ಯ;' సాయంసంధ్యాకాలంలో . హిత; సత్య సంభాషణ)  ನರನ್ಪಲಿ (ಜ್ಞಾನಕಕ್ತಿ) ` @8860 సర్వ చైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ 30 ప్రచోదయాత్ ಭಿಮಹಿಾ ಬುದ್ಧಂ ಯಾ ನಃ - ShareChat