#Every day my Status #ఉషోదయం # పంచాంగం #నేటి రాశిఫలితాలు
🌹 Good morning 🌹
💐 మిత్రులకు శుభోదయం 💐 జనవరి 21 బుధవారం 🌹🌹 21/01/26 🌹🌹 పంచాంగం 🌹🌹 రాశిఫలితాలు 💐🌹💐
ఈరోజు జన్మదినాన్ని/వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే
ఆత్మీయులకు శుభాశీస్సులు - దీర్ఘాయుష్మాన్ భవ!
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺
🍀
*21, జనవరి, 2026*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం*
*శిశిర ఋతౌః / మాఘమాసం / శుక్ల పక్షం*
*తిథి : తదియ* రా 02.47 వరకు ఉపరి చవితి
*వారం : బుధవారం* (సౌమ్యవాసరే)
*నక్షత్రం : ధనిష్ఠ* మ 01.58 వరకు ఉపరి శతభిషం
*సూర్యోదయాస్తమాలు:*
ఉ06.40;సా05.58విజయవాడ
ఉ06.50;సా06.05హైదరాబాద్
*సూర్యరాశి : మకరం చంద్రరాశి : కుంభం*
*యోగం : వ్యతీపాత* సా 06.59 వరకు ఉపరి వరీయాన్
*కరణం : తైతుల* మ 02.47 గరజి రా 02.47 ఉపరి వణజి
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ 09.00 - 10.00 సా 04.00 - 05.00*
అమృత కాలం : ఈరోజు లేదు
అభిజిత్ కాలం : ఈరోజు లేదు
*వర్జ్యం : రా 09.19 - 10.56*
*దుర్ముహూర్తం : ప 11.56 - 12.41*
*రాహు కాలం : ప 12.19 - 01.44*
గుళికకాళం : ఉ 10.54 - 12.19
యమగండం : ఉ 08.04 - 09.29
*ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం : ఉ 06.40 - 08.55
సంగవ కాలం : 08.55 - 11.11
మధ్యాహ్న కాలం : 11.11 - 01.27
అపరాహ్న కాలం : మ 01.27 - 03.42
*ఆబ్ధికం తిధి : మాఘ శుద్ధ తదియ*
సాయంకాలం : సా 03.42 - 05.58
ప్రదోష కాలం : సా 05.58 - 08.30
రాత్రి కాలం : రా 08.30 - 11.53
నిశీధి కాలం : రా 11.53 - 12.44
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.58 - 05.49.✍️
➖▪️➖
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*21-01-2026-బుధవారం*
*రాశి ఫలితాలు:*
➖➖➖✍️
```
మేషం
సమాజంలో విశేషంగా పలుకుబడి పెరుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులు నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో నూతన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. ఉద్యోగస్తులకు పదవులు పెరుగుతాయి.
వృషభం
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వివాదాలకు సంబంధించి ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమ ఫలిస్తుంది. వృత్తి వ్యాపారాలలో మేలైన ఫలితాలు పొందుతారు. సంతానం విద్యా ఫలితాలు సంతృప్తి కలిగిస్తాయి.
మిధునం
బంధుమిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఇతరులకు ధన పరంగా మాట ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. చేపట్టిన పనులు ఆకస్మికంగా వాయిదా వేస్తారు. కుటుంబ విషయంలో స్థిరమైన ఆలోచనలు చెయ్యలేరు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఒత్తిడి తప్పదు.
కర్కాటకం
పాత రుణాలు తీర్చడానికి నూతన ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు మందగిస్తాయి.
సింహం
గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగార్థులకు ఆశించిన స్థాన చలనాలు కలుగుతాయి.
కన్య
దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలరు. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వాతాహవరణం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలిసివస్తాయి.
తుల
కొన్ని వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనుల్లో పురోగతి సాధిస్తారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. సోదరులతో దీర్ఘకాలిక వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఉద్యోగ విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు మరింత కష్టపడాలి.
వృశ్చికం
చేపట్టిన పనులు వ్యయప్రయాసలతో కాని పూర్తికావు. కొన్ని వ్యవహారాలలో కావలసిన వారే మోసగిస్తారు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రహారాలు ఉండవు. వ్యాపారాలు తీసుకున్న నిర్ణయాలు కలిసిరాక నిరాశ కలిగిస్తాయి.
ధనస్సు
సమాజంలో విశేషమైన గౌరవమర్యాదలు కలుగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
మకరం
అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత కలవర పెడతాయి. బంధు మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు వలన విశ్రాంతి ఉండదు.
కుంభం
ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలలో అవసరానికి మించి ఖర్చు చేయవలసి వస్తుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగా కొంత ప్రతికూల పరిస్థితులుంటాయి. ఉద్యోగస్తులకు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడంలో లోపాలు ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.
మీనం
ఆర్థిక లావాదేవీలు కొంత మందకోడిగా సాగుతాయి. శ్రమతో గాని కొన్ని పనులు పూర్తి కావు. కుటుంబ పెద్దలతో కల సూచనలు ఉన్నవి. దూర ప్రయాణాలలో వాహనం ఇబ్బందులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. నిరుద్యోగులకు ప్రయత్నాలు వాయిదా వేస్తారు.✍️```
***************************
. *శుభమస్తు!* ______________________________
*గోమాతను పూజించండి*
*గోమాతను సంరక్షించండి*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.*
💐💐 సేకరణ 💐💐


