అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం: ఆరుగురు దుర్మరణం...
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. శుక్రవారం రాత్రి మిస్సిస్సిప్పిలోని క్లే కౌంటీలో ఓ వ్యక్తి మూడు వేర్వేరు చోట్ల కాల్పులు జరపగా... ఆరుగురు వ్యక్తులు మరణించారు. ప్రస్తుతం నిందితుడు పోలీసు అదుపులో ఉన్నారు. అయితే మృతుల్లో కొందరు నిందితుడి కుటుంబ సభ్యులు, బంధువులు కావడం గమనార్హం. నిందితుడిని 24 ఏళ్ల డారికా మూర్గా గుర్తించామని, అతడిని అరెస్ట్ చేశారని క్లే కౌంటీ షెరీఫ్ ఎడ్డీ స్కాట్ శనివారం రోజున విలేకరుల సమావేశంలో తెలిపారు. నిందితుడిపై ఫస్ట్ - డిగ్రీ హత్య కేసు నమోదైందని, అదనపు హత్య ఆరోపణలతో ఈ కేసు క్యాపిటల్ మర్డర్గా మార్చబడుతుందని చెప్పారు. నిందితుడు ఈ భయంకరమైన దాడులకు పాల్పడటానికి గల కారణం తెలియదని స్కాట్ చెప్పారు. అయితే బాధితులలో కొందరు షూటర్ కు బంధువులేనని తెలిపారు. నిందితుడు డారికా మూర్ కాల్పులు జరిపిన ఘటనను కూడా వివరించారు. "శుక్రవారం సాయంత్రం 6:56 గంటలకు క్లే కౌంటీ పశ్చిమ ప్రాంతంలోని ఒక చిన్న, గ్రామీణ ప్రాంతమైన సెడార్ బ్లని బ్లేక్ రోడ్లో ఓ చోట కాల్పులు జరిగాయని 911కు కాల్ వచ్చిన తర్వాత దర్యాప్తు ప్రారంభమైంది. #😥మరోసారి కాల్పులు..ఆరుగురు మృతి


