ShareChat
click to see wallet page
search
*యాయీరు కుమార్తెను బ్రతికించుట* ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి నాకుమార్తె యిప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమెమీద ఉంచుము, ఆమె బ్రదుకుననెను. యేసు లేచి అతని వెంట వెళ్లెను; ఆయన శిష్యులు కూడ వెళ్లిరి. అంతలో యేసు ఆ అధికారి యింటికి వచ్చి, పిల్లన గ్రోవులు వాయించు వారిని, గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి ..... స్థలమియ్యుడి; ఈ చిన్నది నిద్రించుచున్నదేగాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి. జనసమూహమును పంపివేసి, ఆయన లోపలికి వెళ్లి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించెను. (మత్తయి 9:18 - 26; లూకా 8:40-56) 1. యాయీరు అధికారి: యాయీరు ఒక అధికారి అయినప్పటికీ, ప్రభువుకున్న అధికారం తనవంటిదికాదని గ్రహించగలిగాడు. ఆయన అధికారమునకు ఒప్పుకొని, ప్రభువును బ్రతిమాలాడుతున్నాడు. 2. యాయీరు యొక్క అచంచలమైన విశ్వాసం: నా కుమార్తె చనిపోయింది. అయిననూ, నీవు వచ్చి, నాకుమార్తె మీద చేయి వేస్తే? ఆమె బ్రతుకుతుంది. అని ప్రార్ధిస్తున్నాడు. ఈ మాటలు చూస్తుంటేనే అర్ధమవుతుంది. అతని విశ్వాసమెంతటి పరిపూర్ణమైనదో? తన కుమార్తె కొరప్రాణంతో లేదు. తను చనిపోయిందని అతనికి పూర్తిగా తెలుసు. అతనే ఆ విషయం చెప్తున్నాడు కూడా. గొల్లు చేయువారు వచ్చి ఏడ్వడం ప్రారంభించేసారు. అతని పనివారు అయ్యా, ఆయనను యిబ్బంది పెట్టవద్దు పాప చనిపోయిందికదా? చనిపోయిన ఆమెను ఈయనేమి చేయగలడు? అంటూ సలహాలిస్తున్నారు. “అయిననూ”, నీవు వచ్చి నా కుమార్తెను తాకితే తను బ్రతుక వచ్చేమో? ఒకసారి ప్రయత్నించి చూడు. అనడం లేదు. "బ్రతుకుతుంది". ఇది పరిపూర్ణమైన విశ్వాసం. పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడు ఫలితం శూన్యం. “అయిననూ” నీమాట చొప్పున వల వేస్తాను. ఇదే విధేయత. విశ్వాసానికి విధేయత తోడైతే, విప్లవాత్మకమైన విజయాలు సాధ్యమవుతాయి. 3. యాయీరు కోరికను మన్నించిన ప్రభువు నీవు పిలిస్తే దాటిపోయేవాడు కాదు మన ప్రభువు. చనిపోయిందికదా? వెళ్లి పాతిపెట్టుకో అని ఉచిత సలహా యివ్వలేదు. అతనిని ధైర్యపరిచారు. యేసు ప్రభువు వారు తన శిష్యులతో కలసి ఆ అధికారి ఇంటికి వెళ్లారు. అప్పటికి, పిల్లనగ్రోవులు వాయించేవారు, యేడ్చేవారు వారి పని వారు చేస్తున్నారు. ( ఆ కాలంలో వీరిని డబ్బులిచ్చి పిలిపించుకునే వారు) ప్రభువురాకతో కొందరైతే ఏమిజరుగబోతుందోనని ఆసక్తితో చూస్తుంటే, మరికొందరైతే చనిపోయిన ఆమెను ఇతడేమిచేయగలడని హేళనగా మాట్లాడుతున్నారు “ఈమె చనిపోలేదు నిద్రపోతుంది” అనే ప్రభువు మాటలు మరింత అపహాస్యం చేసేటట్లు చేశాయి. బైబిల్ గ్రంధములో మరణమును నిద్రతో పోల్చడం జరిగింది. నిద్రించిన వాడు తప్పక తిరిగి లేస్తాడు. ఒక వేళ మరణించినా ఆయన మధ్యాకాశములో నుండి, బూర ఊదినప్పుడు, ప్రభువు నందు మృతులైన మృతులు తప్పక లేస్తారు. వారికి ఆ మాటలు అర్ధం కాలేదు. 4. స్థలమియ్యుడి ఆయన మర్యాదస్తుడు. త్రోసుకొని వెళ్ళేవాడుకాదు. స్థలమిస్తేనే ఆయన ప్రవేశిస్తారు. ఆయన ప్రవేశిస్తేనే అద్భుతకార్యం జరుగుతుంది. అక్కడ అదే జరిగింది కూడా. మన జీవితాల్లో ప్రభువుయొక్క ఆశ్చర్యకార్యాలను ఎందుకు చూడలేకపోతున్నాము? పేతురు దోనెలో ఆయనకు స్థలముంది. మన హృదయంలో ఆయనకు స్థలముందా? *ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము*. (ప్రకటన 3 :20) నీ హృదయమనే తలుపు తీసి ఆయనకు స్థలమిస్తే? నీ జీవితమంతా సమాధానమే. ఆయన మహిమను నీవు కళ్లారా చూస్తావు. అనుభవిస్తావు. 5. చనిపోయిన బిడ్డను బ్రతికించిన ప్రభువు: యేసు ప్రభువు వారందరిని బయటకు పంపివేసి, ఆయన లోపలికి వెళ్లి, ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచింది. వారిని బయటకు పంపించడం దేనికి? వారి మధ్యనే ఆ చిన్నదానిని బ్రతికించవచ్చు కదా? ఎందుకంటే? ఆయనను ఎగతాళి చేసినవారు, ఆయన కార్యంలోని మహిమను చూచే అర్హతను కోల్పోతారేమో? సమస్యను చూచి, ఆయన శక్తిని శంకించి, మన జీవితాల్లోకూడా ఆయన ఆశ్చర్య కార్యాలను అనుభవించే ధన్యతను కోల్పోతున్నామేమో? మనలను మనమే పరిశీలన చేసుకోవాలి. 6. ముగింపు మన ప్రార్ధన దేవుని నుండి సమాధానాన్ని తీసుకొని రాలేకపోతుందంటే? మన హృదయంలో ఆయనకు స్థలము లేదేమో? విశ్వాసం కొరవడిందేమో? ఆయనను ఇంకనూ అపహాస్యం చేసే సమూహంలోనే వున్నానేమో? అట్లా అయితే! నీ జీవితంలో ఆయన కార్యాలు చూడడం సాధ్యం కాదు. నీ హృదయమనే తలుపు తీసి ఆయనకు స్థలమిస్తే? నీ జీవితమంతా సమాధానమే. ఆయన మహిమను నీవు కళ్లారా చూస్తావు. అనుభవిస్తావు. ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్! ---- ( సేకరణ) ***************************************** *ప్రతిదినం పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నారా? అయితే మీ కోసమే ఈ గ్రూప్స్...!* *WhatsApp Community - 1 link:* https://chat.whatsapp.com/BKEcChdxaKrK0dJ8CqADcD *************************************** *Telegram group Link* https://t.me/+XtII92fKOXAyNWQ9 ******************************** *యూట్యూబ్ ఛానల్ లింకు* https://www.youtube.com/@calvarykiranalu-l7t ******************************** *మీ ప్రార్దన అవసరతను నా నెంబర్ కు మెసేజ్ చేయండి.... మీ ప్రార్దన మనవిని మన అన్నీ గ్రూప్స్ లో నేనే పోస్ట్ చేయడం జరుగుతుంది. మీ సమస్యపై మన గ్రూప్స్ సభ్యులందరూ ప్రార్దన చేస్తారు. మనకు కావల్చింది వాక్యం, ప్రార్దన.* *- మీ సహోదరుడు మోషే* *- (Calvary Kiranalu )* *-(📲 9550576444)* ************************************ #Jesus #✝️Jesu✝️ #JESU I LOVE YOU JESUS #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #i love jesu
Jesus - యాయీర్లు కుమార్తెను చ్రతికించుట 0= -3 యాయీర్లు కుమార్తెను చ్రతికించుట 0= -3 - ShareChat