💐🌿🙏 నా మనసు అర్పణం 🙏🌿💐🧿
___________________________________________
జ్ఞాన శూన్యుడను తల్లీ లలితా పరమేశ్వరి మాత!!
నిన్ను స్తోత్రం చేయలేను ..🌿 స్థిర బుద్ధి లేని వాడను.. నిన్ను ధ్యానించలేను.. 🌿 శక్తి లేదు తల్లీ.. నీకు సేవ చేసేందుకు ... 🌿 నాది అన్నది ఏమీ లేదు తల్లీ! అన్నీ నీవు పెట్టిన భిక్షలే కదా అమ్మా! ... ఈ భిక్షగాడికి నీవు తప్ప నాకు ఎవ్వరూ లేరు తల్లీ! ....🌿 నీ చెంతనే నాకు రక్ష తల్లీ.... 🌿🧿💐🙏🌹💚🚩
అయినా.... ఒకటి ఇస్తాను తల్లీ! ....కాదనకుండా అందుకుంటారా.. తల్లీ!... ఒక అపురూపమైన "" ఉయ్యాల "" ఇస్తాను తల్లీ .. నా స్వామి సదాశివుని తో కలసి ఊగేందుకు..అది ఎప్పుడూ ఆగకుండా ఊగుతూనే వుంటుంది. 🚩🌿
దానికి బోయలు అక్కరలేదు... కానీ పల్లకీలా మోస్తుంది. మెరుపులాంటి తళుకులతో మెరుస్తూనే వుంటుంది. నీవు కోరిన లోకాలకు విహరింపజేస్తుంది. ..మరెవరో కాదు తల్లీ! ...అది నా " మనసు " 🌿🚩💚🌹🙏💐🧿
నా మనసు స్థిరంగా ఉండక ఎప్పుడూ ఊగుతూ ఉంటుంది కాబట్టి "" ఊయల "" అని అన్నాను. 🌿🙏
తలచిన చోటుకు క్షణంలో చేరుస్తుంది కావున " పల్లకి" అని అన్నాను. 🌿🙏
నాది నాది అని అరిచే ఈ " మనసు " నాకు వద్దు తల్లీ!.. నీవే తీసుకో... నీవే అధిరోహించు .... నీ పాదాల చెంత నన్ను తరింపజేయి అమ్మా! .. నీ పాద రేణువును తల్లీ.. నన్ను కరుణించు మాత.. మీ పాదాల చెంత ఉండేటట్లు... వరమివ్వు తల్లీ! .....
_________________________________________
HARI BABU. G
________________________________________
ఓం శ్రీ మాత్రే నమః
#భక్తి స్పెషల్ #🙏ఓం నమః శివాయ🙏ૐ #✍️నా మది అంతరంగం💜 #💗నా మనస్సు లోని మాట #📙ఆధ్యాత్మిక మాటలు


