ShareChat
click to see wallet page
search
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: భానుసప్తమి, విజయ సప్తమి, కల్యాణ సప్తమి (సూర్యారాధన విశేష ఫలప్రదము) #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: రథసప్తమి 🌅 సూర్యభగవానుని జయంతి 🌄🙏 #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఆరోగ్య ప్రదాయిని 🌄 ఆదిత్యుని పూజ🙏 #సర్వదేవాత్మకుడు ఆదిత్యుడు 🌄 *సూర్యారాధన* *బ్రహ్మస్వరూపముదయే, మధ్యాన్నేతు మహేశ్వరం* *సాయంధ్యాయే సదా విష్ణుం, త్రయీమూర్తిర్దివాకరః* మనకు ప్రతిరోజూ సాక్షాత్కరించే సూర్యభగవానుడు త్రిమూర్తి స్వరూ పుడని పైశ్లోకానికి అర్థం. ముల్లోకములలోనివారికి త్రికాలలో ఆరాధనీ యుడు సూర్యుడు. ఈ చరాచర జగత్తునుండి తిమిరాలను పోగొట్టి తన కరుణా కటాక్ష వీక్షణాలనుండి వెలుగును ప్రసాదించే అవతారమూర్తి సూర్యభగవానుని వేద స్వరూపునిగా, కర్మసాక్షిగా పేర్కొంటున్నాయి పురా ణాలు.'సూర్య' అను పదమునకు సకల జగత్తును చైతన్యపరిచేవాడని భావము. 'సువతి ప్రేరయతి వ్యాపారేష్టితి సూర్యః' అని ఉపనిషద్ నిర్వ చనం. జగత్తును చైతన్యపరిచేవాడు కనుక జగదారాధ్యుడైనాడు. సూర్యుడు అదితి కశ్యపుల తొలి సంతానం. కశ్యప పుత్రుడు కనుక కాశ్యపేయుడని, అదితి కుమారునిగా ఆదిత్యుడని పిలువబడుతున్నాడు. సూర్యునికి సంజ్ఞ, ఛాయ అని ఇద్దరు భార్యలు. యముడు, శని పుత్రులు. సూర్యరథానికి చిత్రరథమని పేరు. ఆ కారణంగా చిత్రరథుడనే పేరు వచ్చింది. సూర్యుని రథానికి ఒకే ఒక చక్రం. సూర్యరథాన్ని సప్త అనే అశ్వం లాగుతుంది. అది 'సప్తకాంచన సన్నిభం' అంటే ఏడు రంగుల కిర ణాలను ప్రసరింపజేస్తుంది. ఆ ఏడు రంగులు వ్యక్తి శరీరంలో ఉండే ఏడు ధాతువులు- మజ్జ, మాంసం, మేధస్సు, ఎముక, శుక్రం, శోణితం, చర్మం అనువాటిపై ప్రభావం కలిగివుంటాయి. అనంత శక్తిమయమైన ఆ కిర ణాలు వ్యక్తిపై ప్రసరిస్తే వాటివల్ల ఆయా ధాతువులపై ఉన్న రోగ లక్షణాలు నిర్మూలనమై ఆరోగ్యం లభిస్తుంది. అందుకే మనుస్మృతి 'ఆరోగ్యం భాస్క రాదిచ్ఛేత్' అని కీర్తించింది. _సూర్యుని నుండి ప్రసరించే ఏడు కిరణాలు-_ 1. *సుషుమ్నము - నాడీ మండలాన్ని ఉత్తేజపరస్తుంది.* 2. *హరికేశము - గుండె జబ్బులను నివారిస్తుంది.* 3. *విశ్వకర్మము - రక్తహీతను, తత్సంబంధమైన వ్యాధులను నిర్మూలిస్తుంది.* 4. *విశ్వత్వచము - శ్వాసకోస సంబంధిత వ్యాధులను తొలగిస్తుంది.* 5. *సంపద్వసుము - జననేంద్రియ వ్యవస్థను దృఢపరుస్తుంది.* 6. *అర్వాగ్యాసుము - నరాల బలహీనతను నివారిస్తుంది.* 7. *స్వరాజ్యసుము - స్వరపేటికకు, మూత్రపిండాలను వ్యాధులను నివారిస్తుంది.* సూర్యారాధన గురించి రామాయణము, మహాభారత గ్రంథాలలో విస్తృతంగా చెప్పడం జరిగింది. అగస్త్యుని ద్వారా ఆదిత్య హృదయము అను స్తోత్రాన్ని ఉపాసించి శ్రీరాముడు రావణ సంహారం చేసినట్లు, వన పర్వంలో ధర్మరాజు ఆదిత్యుని ఉపాసించి అక్షత పొందినట్లు కథలు న్నాయి. దివోదాసుడనే రాజు సూర్యకిరణాల సాయంతో జీవితమంతా ఆహారాన్ని వండుకుని భుజించినట్లు స్కాందపురాణం వచిస్తున్నది. శ్రీకృ ష్ణుని పుత్రుడు సాంబుడు సూర్యోపాసనతో తనకు సంక్రమించిన కుష్ఠు రోగం నుండి విముక్తుడయ్యాడు. జ్యోతిష శాస్త్రం ననుసరించి ప్రళయాంతరంలో సకల జగత్తు అంధకా రమయం కాగా పరాశక్తి ఆదేశానుసారం పరమేశ్వరుడు తిరిగి సృష్టిని ప్రారంభిస్తూ తొల్గొల్తగా గ్రహ నక్షత్రాదులను సృష్టించి గ్రహాధిపతియైన సూర్యునిగా తానే వెలుగొందాడని పురాణ వచనం. అట్టి భాస్కరుని నుండి సృష్టి రచించబడిందని సూర్యోపనిషత్తు తెలియజేస్తుంది. భగవతారాధనలో ఆదిత్యుని మించిన దైవం లేదని చెబుతూ శ్రీ శంకర భగవత్పాదులు ఏర్పాటుచేసిన పంచాయతన అర్చనావిభాగంలో ఆదిత్యు నికి ప్రముఖ స్థానం కల్పించారు. సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారాలు చేస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, శరీర కాంతి, పటుత్వం, పాపక్షయంతోపాటు సకల సౌభా గ్యాలు లభిస్తాయని శాస్త్రవచనం. సూర్య నమస్కారాల విశిష్టతను యోగ శాస్త్రం అతిఘనంగా చెప్పింది. సూర్యుడు సకల విద్యలకు అధినేత. యాజ్ఞవల్కునికి, ఆంజనేయునికి సకల విద్యలు ప్రసాదించిన గురువు. సూర్యారాధన ప్రశస్తి త్రేతాయుగం నాటికే ఉందని ప్రశస్తి. విశ్వామిత్రుడని గాయత్రీ మంత్రం సూర్యోపాసనే. వైవశ్వత మనువుకు సూర్యనారాయ ణుడు మాఘ శుక్ల సప్తమినాడు దర్శనమిచ్చాడు. ఆ రోజును రథసప్త మిగా, సూర్య జయంతిగా పరిగణింపబడుతున్నది. అందరూ రథసప్తమి నాడు శుచిగా సూర్యారాధనతోపాటు సూర్య నమస్కారాలు చేసి ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణుని అనుగ్రహం పొందాలని ఆకాంక్ష. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: భానుసప్తమి, విజయ సప్తమి, కల్యాణ సప్తమి (సూర్యారాధన విశేష ఫలప్రదము) - GOa ಟedoro సేరారారద్దెనె OO Daily Wish Telugu O+91 9700 722 711 GOa ಟedoro సేరారారద్దెనె OO Daily Wish Telugu O+91 9700 722 711 - ShareChat