ShareChat
click to see wallet page
search
🌹🌹శ్రీశారదాదేవి జీవిత విశేషాలు :🌹🌹 ☘️🍄☘️ Laila Madhu Pasupuleti, Yashoda Durga boddu, Jayalakshmi Gopisetti, varalakshmi Sirugudi☘️🍄☘️ గురుదేవుల నిర్యాణానికి (శరీరం వదిలివేయడం) సూచనలు :-- ఐదవ ఏటనే పెళ్లి చేసుకొని, తనను భార్యగా, శిష్యురాలిగా, కుమార్తెగా, అంతెందుకు తల్లిగా కూడా ఆదరించిన ఆ ప్రేమమూర్తి నిష్క్రమింపనున్నారా? అనే ఆలోచనే మాతృదేవి హృదయాన్ని కలచివేయసాగింది. గొంతులో వ్రణం రావడానికి నాలుగైదు సం॥లకు మునుపే గురుదేవులు మాతృదేవితో, "ఎప్పుడు విచక్షణారహితంగా ఎవరు ఇచ్చిన ఆహారాన్నైనాసరే తీసుకుంటానో, ఎప్పుడు రాత్రుళ్లు కలకత్తాలో గడుపుతానో, ఎప్పుడు ఆహారంలో కొంత భాగాన్ని ఇతరుల కిచ్చి మిగిలిన దానిని తీసుకుంటానో, అప్పుడు నేను నిష్క్రమించే రోజు దూరంలో లేదని తెలుసుకో" అని చెప్పారు. గొంతులో వ్రణం రావడానికి కొంత కాలం ముందు నుండి ఇలాగే జరగసాగింది. కలకత్తాలో పలుచోట్ల పలువురు భక్తుల ఆహ్వానాన్ని మన్నించి వారి ఇళ్లకు వెళ్లిన గురుదేవులు, అన్నం మినహాయించి తక్కిన అన్ని రకాల ఆహారాన్ని అందరి వద్ద నుండి స్వీకరించసాగారు. అనుకోకుండా బలరాం ఇంట్లో అప్పుడప్పుడు రాత్రుళ్లు గడపడం కూడా జరిగింది. ఒక రోజు తమకంటూ ప్రత్యేకంగా వండిన అన్నాన్ని ముందుగా నరేంద్రుని కిచ్చి (స్వామి వివేకానంద) మిగిలిన అన్నం తాను తిన్నారు. మాతృదేవి దానిని వారించినప్పుడు ఆయన, “మొదట నరేంద్రునికి ఇవ్వడంలో నా మనస్సులో ఎలాంటి నిర్బంధమూ కలుగలేదు. అందులో దోషం కూడా లేదు” అన్నారు. "గురుదేవులు ఇలా అన్నప్పటికీ, ఆయన ముందు చెప్పిన దానిని గురించి ఆలోచించి నేను మనశ్శాంతి కోల్పోయాను”. తమ నిర్యాణ సమయానికి మరొక సూచనగా, "నన్ను ఎప్పుడు భక్తులు దైవంగా ఆరాధించడం మొదలు పెడతారో అప్పుడు నా నిర్యాణ సమయం ఆసన్నమయిందని గ్రహించుకో" అంటూ గురుదేవులు చెప్పివున్నారు. అది కూడా జరిగింది. గురుదేవులు చికిత్సకోసం కలకత్తా వెళ్లారని తెలియని భక్తులు కొందరు దక్షిణేశ్వరం వెళ్లి విషయం తెలుసుకున్నప్పుడు వారికి చెప్పలేనంత అసంతృప్తి కలిగింది. అయినా ఆయన గదికి వెళ్లి ఆయన చిత్రపటం ముందు తాము తెచ్చిన తీపి పదార్థాలను నైవేద్యంగా ఆయనకు అర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించారు. ఈ సంఘటన విన్నప్పుడు మాతృదేవి ఎంతో కలత చెందారు. గురుదేవులు ఆమెను ఓదారుస్తూ, “దీనికోసం ఎందుకిలా కలవరపడుతున్నావు? కాలక్రమంలో నన్ను ప్రతి ఇంటా ఆరాధిస్తారు. ఇది సత్యం. కనుక కలత చెందకు" అన్నారు. మాతృదేవి మనస్సు సాంత్వన పొందలేదు. అంతే కాకుండా శ్యాంపుకూర్లో ఒకసారి కాళీపూజ రోజు భక్తులు గురుదేవులనే కాళీమాతగా పూజించారు. వీటినన్నిటిని తలచుకొని మాతృదేవి మనస్సు తీరని ఆవేదనకు గురయింది. సేకరణ శ్రీ మాత్రే నమః #🖌பக்தி ஓவியம்🎨🙏 #🔯இந்த ராசிகளுக்கு அதிர்ஷ்டம்🌠 #🙏நமது கலாச்சாரம் #🙏ஏகாதசி🕉️
🖌பக்தி ஓவியம்🎨🙏 - HAPPY NAVRATRI नवरातरी mna Famy Party విద్యవిద్య 712 ೧aos' ~L2AOa~ CUAAPSUPUUET HAPPY 4701 ' HAPPY NAVRATRI नवरातरी mna Famy Party విద్యవిద్య 712 ೧aos' ~L2AOa~ CUAAPSUPUUET HAPPY 4701 ' - ShareChat