#షట్తిల ఏకాదశి #షట్తిల ఏకాదశి💐🎂 #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #షట్తిల ఏకాదశి శుభాకాంక్షలు #షట్తిల ఏకాదశి శుభకాంక్షలు
*షట్తిల ఏకాదశి*
_జనవరి 14 బుధవారం షట్తిల ఏకాదశి సందర్భంగా..._
🔯 *షట్తిల_ఏకాదశి_అంటే_ఏమిటి?*
☸️ *ఆరోజు_ఏంచేయాలి?*
ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. తిల అంటే నువ్వులు షట్తిల ఏకాదశి రోజు ఆరు విశిష్ఠ కార్యక్రమాలు నిర్వహించడం శ్రేయస్కరమని శాస్త్రాల్లో పేర్కొన్నట్లు పండితులు చెబుతున్నారు. ఆ రోజు శ్రీమన్నారామణునికి, పితృదేవతలకు అత్యంత ప్రీతికమైనది. అందువల్ల షట్ తిల ఏకాదశినాడు ఆచరించాల్సిన ఆరు ధర్మ విధులు.
*షట్తిల ఏకాదశి నాడు నిర్వర్తించాల్సిన ఆరు తిల విధులు*
*ఆ ఆరు తిల విధులు ఏమిటంటే..*
🌺1) తిలాస్నానం - నువ్వుల నూనె వంటికి రాసుకుని , నువ్వులతో స్నానం చేయాలి నువ్వులు నెత్తిమీద నుండి జాలువారేలా స్నానం చేయాలి.
🌺 2) తిల లేపనం – స్నానానంతరం నువ్వులను ముద్ద చేసి ఆ పదార్థాన్ని శరీరానికి పట్టించడం
🌺 3) తిల హోమం - ఇంటిలో తిల హోమం నిర్వహించాలి.
🌺 4) తిలోదకాలు – పితృ దేవతలకు తిలోదకాలు సమర్పించాలి. అంటే నువ్వులు నీళ్లు వదలడం అన్నమాట , నువ్వులు బొటన వేలుకు రాసుకుని ఒక పద్దతి ప్రకారం నీళ్లతో వదలడం.
🌺 5) తిలదానం - నువ్వులు కాని , నువ్వుల నూనె కాని ఒక బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి.
🌺 6) తిలాన్నభోజనం – నువ్వులు కలిపి వండిన భోజనం భుజించడం. అంటే బియ్యం వుడికె సమయంలో నువ్వులు వేస్తే అది తిలాన్నం అవుతుంది)
ఆ రోజున తిలలతో నిర్వహించే ఈ ఆరు పనులు పూర్తి చేస్తే శ్రీ మహా విష్ణువుతో పాటుగా పితృ దేవతలు కూడా సంతోషించి శుభప్రదంగా ఆశీర్వదిస్తారు. ఈ నాడు చేసే షట్తిలా కార్యక్రమాలు శ్రీ మహావిష్ణువును ఎంతో తృప్తిపరుస్తాయట. ప్రతీ ఏటా తిలా ఏకాదశిని యధావిధిగా పాటిస్తే ఆ శ్రీమన్నారాయణుడు సంతసించి ఇహలోకంలో సర్వసుఖాలు , మరణానంతరం ఉత్కృష్ట లోకాలు ప్రాప్తింప చేస్తాడు.
📌 *సూచన:-* షట్తిల ఏకాదశి రోజున నిర్వహించే హోమము , దాన క్రియలు మాత్రం పురోహితుని పర్యవేక్షణలో జరుపవలసి ఉంటుంది.
*🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*


