ShareChat
click to see wallet page
search
సాయిబాబా స్మరణ తో జీవన మాధుర్యం సాయిబాబా సూక్తులు చాలా సరళంగాఉంటాయి. ఆయన బోధనలు మనల్ని రకరకాల అవలక్షణాల నుండి బయట పడేస్థాయి. సద్గుణాలు, సదాచారాలు నేర్పే విధంగా ఉంటాయి. సాయిబాబా ఉద్బోధ మానవ కల్యాణం కోసమే. బాబా సూక్తులు కొన్ని చూడండి. "నేను" అనే అహంకారాన్ని వదిలిపెట్టండి. నన్ను నమ్మండి. మీధుఃఖాలన్నీ మర్చిపోయి, నిశ్చింతగా ఉండండి.భారం నామీద మోపండి.ఎల్లవేళలా నేను మీతోనే ఉంటాను. అహంకారాన్ని త్యజించిన క్షణాన మీ మనసులో స్థిరంగా ఉంటాను. మీకు సంపూర్ణ వికాసాన్ని కలిగిస్తాను. మీరు చేయాల్సిందల్లా ధ్యానం. ఇతర ధ్యానాలన్నీ వదిలి నామీదే దృష్టి నిలపండి. నిరంతరం స్మరించండి, జపించండి మనసులో అలజడులన్నీ తగ్గుతాయి.కోరికలన్నీ తీరతాయి.పూర్తి ప్రశాంతత అనుభూతిలోకి వస్తుంది. #🕉 ఓం సాయిరామ్😇 #🙏🏼షిరిడి సాయి బాబా #🌅శుభోదయం #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🎶భక్తి పాటలు🔱
🕉 ఓం సాయిరామ్😇 - ShareChat